Union Budget | కేంద్ర బడ్జెట్‌పై వేతన జీవులు బోలెడన్నీ ఆశలు పెట్టుకున్నారు. కొత్త ఆదాయపు పన్ను విధానాలు తీసుకురావాలని చాలా మంది ట్యాక్స్ పేయర్లు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే వారం పార్లమెంట్లో ఇన్కమ్ ట్యాక్స్( ప్రత్యేక వ్యక్తిగత ఆదాయపు పన్ను) బిల్లు ప్రవేశపెట్టునున్నట్లు తెలిపారు. ఈ బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇన్కమ్ ట్యాక్స్‌లో అనవసరపు సెక్షన్లను తొలగిస్తామని తెలిపారు.
మరోవైపు పట్టణాల్లో ఆదాయ వృద్ధి, పేదరిక నిర్మూలనపై దృష్టి పెట్టినట్లుగా నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ క్రమంలోనే పట్టణ పేదల కోసం రూ.30 వేల పరిమితితో యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే, బీమారంగంలో వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. కస్టమ్స్ చట్టంలో మార్పులు, 7 రకాల సుంకాలను తొలగిస్తామని చెప్పారు.