Game Changer – Ram Charan| గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియార అద్వానీ జంటగా నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్గా నిలిచింది. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ సినిమా రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే శంకర్ అదే పాత స్టోరీతో ప్రేక్షకుల ముందు రావడంతో భారీ నష్టాన్ని చవి చూసింది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం ఫిబ్రవరి 07 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను పంచుకుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రామ్నందన్ (రామ్చరణ్) విశాఖ కలెక్టర్గా బాధ్యతలు తీసుకుంటాడు. ఇదే సమయంలో అభ్యుదయ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి సత్యమూర్తి (శ్రీకాంత్) పదవీకాలం మరో ఏడాదిలో ముగుస్తుంది. సత్యమూర్తి కొడుకు బొబ్బిలి మోపిదేవి (ఎస్.జె.సూర్య) ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేస్తాడు. తండ్రిని అడ్డుతొలగించి పదవి కోసం ఓ పన్నాగం పన్నుతాడు. సరిగ్గా ఇదే సమయంలో రామ్నందన్కు సంబంధించిన ఓ రహస్యం బయటపడుతుంది. ఏమిటా రహస్యం..? రామ్నందన్కు సత్యమూర్తికి వున్న అనుబంధం ఏమిటి..? ఈ కథలో అప్పన్న (రామ్చరణ్) ఎవరు? ముఖ్యమంత్రి కుర్చీ కోసం మోపిదేవి చేసిన కుట్రలని రామ్నందన్ ఎలా తిప్పికొట్టాడు? ఇవన్నీ తెరపై చూడాలి.
raa macha, buckle up 😎 the rules are about to CHANGE 👀#GameChangerOnPrime, Feb 7 pic.twitter.com/ewegjT69yL
— prime video IN (@PrimeVideoIN) February 4, 2025