పంటలు ఎండితే మాకు దిక్కెవరు?
సాగు నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని, పెట్టుబడి అప్పులు ఎవరు భరిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
- అప్పులు చేసి సాగు చేసినం
- నీళ్లులేక ఎండితే మా పరిస్థితేంటి?
- అధికారులతో రైతుల వాగ్వాదం
నాగర్కర్నూల్, మార్చి 10 : సాగు నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని, పెట్టుబడి అప్పులు ఎవరు భరిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. వారం రోజులుగా నాగర్కర్నూల్ జిల్లాలోని గుడిపల్లి రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా ప్రవాహం తగ్గిపోవడంతో మంగళవారం 50 మంది రైతులు నాగర్కర్నూల్, బిజినేపల్లి మండలాల అన్నదాతలు సల్కర్పేట సమీపంలో ఉన్న బై కెనాల్ కాలువ వద్ద నిరసన తెలిపారు. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు చేతికందే సమయంలో నీళ్లు లేక ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమస్యను ఎమ్మెల్యే రాజేశ్రెడ్డితోపాటు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. రైతులకు నీళ్లు అందకుండా కాలువల్లో అడ్డుకట్ట వేసి కల్వకుర్తికి తరలిస్తున్నారని మండిపడ్డారు. పంటలు ఎండిపోతే అధికారులే బాధ్యులవుతారని హెచ్చరించారు. ఇరిగేషన్ అధికారులు అక్కడికి వెళ్లగా పంటలకు నీళ్లివ్వాలని వాగ్వాదానికి దిగారు. సరిపడా నీటిని అందిస్తామని రైతులకు హామీ ఇచ్చి వెళ్లిపోయారు.
ఇంకా చదవల్సిన వార్తలు
పంటలెండుతున్నయ్.. నీళ్లియ్యండి సారూ! ; కరీంనగర్ జిల్లా వీణవంక రైతుల వినతి
వీణవంక, మార్చి 10 : సాగు నీరు లేక పొట్టదశకు వచ్చిన వరి పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసి ఆదుకోవాలని కరీంనగర్ జిల్లా వీణవంక రైతులు ప్రభుత్వంతోపాటు ఇరిగేషన్ డీఈఈని కోరారు. మంగళవారం వారు మీడియా తో మాట్లాడుతూ.. వీణవంక పెద్ద చెరువు తూముకు మరమ్మతులు చేయకపోవడంతో సాగు నీరు వృథాగా పోతుందని తెలిపారు. ఈ చెరువు కింద 200 ఎకరాలు సాగవుతుందని, సుమారు వెయ్యి కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. పంట చేతికి వచ్చే సమయంలో నీళ్లులేకపోతే ఎండిపోయి ఎడారిలా మారే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా స్పందించి ఎస్సారెస్పీ కాలువ ద్వారా బేతిగల్ చెరువును నింపితే అక్కడి నుంచి వచ్చే నీటితో వీణవంక చెరువు నిండుతుందనిర రైతులు కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

