అర్వపల్లి, ఆగస్టు 14 : చదువుకున్న స్కూల్ అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం అభినందనీయమని అర్వపల్లి మండల విద్యాధికారి బాలు నాయక్ అన్నారు. శుక్రవారం తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.5 లక్షల 70 వేలతో నిర్మించిన కళావేదికను ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. అలాగే హై స్కూల్, ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతులకు దాతలు ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంలో రత్నం లక్ష్మాజి, మారం లింగారెడ్డి, సార్ల వెంకన్న, జీడి భిక్షం, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, నాగార్జున రెడ్డి, సంతోష్, చిన్న తిరుమల్ రావు, మల్లేష్, శ్రీనివాస్ రెడ్డి, జీడి వీరస్వామి, రజాక్, బొడ్డు శంకర్ పాల్గొన్నారు.