మంచాల, మార్చి 10: భూముల పేర్ల మార్పిడి వ్యవహారంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారంటూ రంగారెడ్డి జిల్లా మంచాల తహసీల్దార్‌పై రైతులు దాడికి యత్నించారు. పెట్రోల్‌తో తహసీల్దార్‌పై దాడి కి యత్నించగా సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. ఆరుట్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 880, 883 బండలేమూరుకు చెందిన కేలోత్ సర్యానాయక్ పేరుమీద 3.17 ఎకరాలు, కేలోత్ బోట్యానాయక్ పేరుమీద 3.16 ఎకరాల భూమి ఉంది. 2025లో సర్యానాయక్, బోట్యానాయక్ ఆన్లైన్ రికార్డులో తమ పేర్లు రావడం లేదంటూ కోర్టును ఆశ్రయించగా నవంబర్‌లో కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వారి పేరున ఈ భూమిని మార్చాల్సి ఉండగా అందులో 2.4 ఎకరాల ను 24 మంది రైతుల పేర్ల మీదకు అధికారు లు మార్చారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ పేరుమీద ఉన్న భూమిని ఎలా తొలగిస్తారంటూ బాధితులు నిలదీశా రు. దీంతో అధికారులు, రైతులకు వాగ్వాదం జరుగగా పోలీసులు రైతులను కార్యాలయం నుంచి బయటికి పంపించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే పేర్లు మార్పిడి చేసినట్టు తహసీల్దార్ ప్రసాద్‌రావు తెలుపగా, బాధితులు మాత్రం తమకు అన్యాయం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.