హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 వివాదం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నిరుద్యోగ జేఏసీ నేతలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి, స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని సుప్రీంకోర్టు అనుమతించింది.
హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): యూపీఎస్సీ సివిల్ సర్వీస్-2025 పరీక్షలో అడిషనల్ డీజీపీ(లా అండ్ ఆర్డర్) మహేశ్ భగవత్ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. దేశ వ్యాప్తంగా 958 మంది అభ్యర్థులు ఎంపికవ్వగా, ఇందులో 300 మంది మహేశ్ భగవత్ మార్గదర్శకంలో ఫైనల్ లిస్టుకు ఎంపికై ప్రతిభ చాటారు. షార్ట్ లిస్టు అయిన అభ్యర్థుల్లో టాప్ 100 మందిలో 37 మంది అభ్యర్థులు చోటు దక్కించుకున్నారు. మహేశ్ భగవత్ అడిషనల్ డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తూనే కొన్నేండ్లుగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీసెస్, సీఏపీఎఫ్ ఇంటర్వ్యూలకు సివిల్స్ అభ్యర్థులకు మెళకువలు నేర్పుతున్నారు. మెరుగైన ర్యాంకులు రావడానికి సహకరించిన సహచరులకు మహేశ్ భగవత్ కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): పోలీ స్ భద్రతా, ఆరోగ్య భద్రతా విభాగం నూతన కార్యదర్శి గా రిటైర్డ్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్‌రెడ్డిని డీజీపీ, పోలీస్ భద్రతా, ఆరోగ్య భద్రతా విభాగం మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ బీ శివధర్‌రెడ్డి నియమించారు. డీజీపీ కార్యాలయంలో మంగళవారం పోలీస్ భద్రతపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఉదయ్‌కుమార్‌రెడ్డి నిరుడు ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ఎస్పీగా విధులు నిర్వహించారని పేర్కొన్నారు. 20 ఏండ్లుగా పోలీస్ భద్రతా, ఆరోగ్య భద్రతా కార్యదర్శిగా పనిచేసిన ఏ గోపాల్‌రెడ్డి ఇటీవల కన్నుమూశారని, ఆయన సేవలు మరువలేమని చెప్పారు.
హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మూడు జిల్లాల్లో భారీగా ఇసుకను అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నట్టు గుర్తించామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ శిఖాగోయల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు జిల్లాల్ల్లో 9,10 తేదీల్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించి, భారీగా ఇసుక, వాహనాలు సీజ్ చేశామని పేర్కొన్నారు. సుమారు 1,875 టన్నుల ఇసుకను రికవరీ చేశామని తెలిపారు.