హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ వేదికగా ఏప్రిల్ 2, 3 తేదీల్లో 13వ ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ భాగస్వామ్యంతో ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో సదస్సు బ్రోచర్‌ను మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. టెక్స్టైల్ రంగంలో తెలంగాణను ప్రపంచ స్థాయి ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ సదస్సు ద్వారా జాతీయ, అంతర్జాతీయ టెక్స్ టైల్ ప్రతినిధులు, పెట్టుబడిదారులు ఒకే వేదికపైకి రావడంతో రాష్ట్రంలో టెక్స్టైల్ రంగానికి మరింత ఊపు నివ్వనున్నట్లు చెప్పారు.