సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా, శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు గ్రేటర్లో గరిష్ఠం 37.4, కనిష్ఠం 24.6 డిగ్రీలు, గాలిలో తేమ 27 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.