భారతీయుడు సినిమాలో మనీషా కోయిరాల కోసం రాసిన ‘మెల్బోర్న్ మెరుపులు మెరిసేదాన’ గుర్తుందా. ఆ పాట అలనాటి బాలీవుడ్ బ్యూటీ రేఖకు అతికినట్టు సరిపోయిందిప్పుడు! బాలీవుడ్ గోల్డెన్ ఏజ్ బ్యూటీ మెల్బోర్న్ వేదికపై మెరిసిపోయింది. ఈ ఆసీస్ నగరంలో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన నటనకు మచ్చుతునక అయిన ఉమ్రావ్ జాన్ చిత్రాన్ని ప్రదర్శించారు.
బాలీవుడ్లో అందం, అభినయంతో అగ్రతారగా రాణించిన ఆమె సిల్సిలా, ఖూబ్సూరత్, ఇజాజత్, ఘర్, ఖిలాడియోన్ కా ఖిలాడి లాంటి సినిమాలతో సినీ ప్రేక్షకులను అలరించింది. తన నటనా ప్రతిభను గౌరవిస్తూ మెల్బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు.