– బూర్గంపహాడ్‌లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 21 : అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం బూర్గంపహాడ్ ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. 30 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలతో పాటు రూ.7.80 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేసినట్లు తెలిపారు. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు నిరుపేద లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు.
సీఎంఆర్ఎఫ్ బాధిత కుటుంబానికి ఆర్ధిక భరోసా కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, హౌసింగ్ ఏఈ ఉదయ్ కిరణ్, ఎంపీవో రామకృష్ణ, బూర్గంపహాడ్ సర్పంచ్, ఉప సర్పంచ్‌లు మందా నాగరాజు, గుండె వెంకన్న, ఇతర పంచాయతీల సర్పంచులు బాదం వెంకటేశ్‌రెడ్డి, భూక్యా పద్మ, ఉప సర్పంచ్ మోహన్‌రావు, మండల నాయకులు వారాల వేణు, భజన ప్రసాద్, సతీష్, ఎడమకంటి సుధాకర్‌రెడ్డి, దాసరి సాంబ పాల్గొన్నారు.