Teacher Shot Dead | విద్యార్థుల ముందే టీచర్‌ను కాల్చి చంపిన వ్యక్తి.. అక్కడే కాల్చుకుని ఆత్మహత్య
Teacher Shot Dead | ఒక వ్యక్తి స్కూల్‌కు వెళ్లాడు. ఒక ఉపాధ్యాయురాలిని కలిసిన అతడు తన వెంట తెచ్చిన తుపాకీతో కాల్పులు జరిపి ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత అతడు తనను తాను గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది చూసి ఆ స్కూల్ విద్యార్థులు, టీచర్లు షాక్ అయ్యారు.
లక్నో: ఒక వ్యక్తి స్కూల్‌కు వెళ్లాడు. ఒక ఉపాధ్యాయురాలిని కలిసిన అతడు తన వెంట తెచ్చిన తుపాకీతో కాల్పులు జరిపి ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత అతడు తనను తాను గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది చూసి ఆ స్కూల్ విద్యార్థులు, టీచర్లు షాక్ అయ్యారు. (Teacher Shot Dead) ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో ఈ సంఘటన జరిగింది. హిదాయత్ నగర్ నివాసి అయిన 26 ఏళ్ల నిషాత్ ఫాతిమా ఏడాదిగా లఖింపూర్ ఖేరీలోని చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నది. సోమవారం ఉదయం 11:30 గంటలకు ఆమెకు తెలిసిన 28 ఏళ్ల మహమ్మద్ సౌద్ ఆ స్కూల్‌కు చేరుకున్నాడు. కారిడార్‌లో ఫాతిమాను కలుసుకుని మాట్లాడాడు. ఉన్నట్టుండి బ్యాగ్ నుంచి తుపాకీ తీసి ఆ టీచర్‌పై కాల్పులు జరిపి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడే తనను తాను గన్‌తో కాల్చుకుని అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది చూసి ఆ స్కూల్ విద్యార్థులు, టీచర్లు భయాందోళన చెందారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ స్కూల్‌కు చేరుకున్నారు. పిల్లలను స్కూల్ నుంచి వారి ఇళ్లకు పంపివేశారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత టీచర్ ఫాతిమా, సౌద్ మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఫాతిమా, సౌద్ చాలా కాలంగా ఒకరికొకరు తెలుసని, నిత్యం మాట్లాడుకునేవారని పోలీస్ అధికారిణి ఖ్యాతి గార్గ్ తెలిపారు. అయితే సౌద్ ఎందుకు ఆమెను కాల్చి చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడో అన్నది తెలియలేదని చెప్పారు. ఇరు కుటుంబాలతో పాటు, స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, ప్రత్యక్ష సాక్షులు, ఇతరులను విచారిస్తున్నట్లు పోలీస్ అధికారిణి వివరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

