కారేపల్లి, సెప్టెంబర్ 21 : మానవ అక్రమ రవాణా ప్రపంచంలో ఎక్కువ జరుగుతున్న నేరాల్లో మూడవ అతి పెద్ద నేరంగా ఉందని, దానిని నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఐసీడీఎస్ కామేపల్లి ప్రాజెక్టు సీడీపీవో ఉమ, ప్రజ్వల ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ సురేష్ కుమార్, సర్పంచ్ దండు ప్రమీణ అన్నారు. ప్రజ్వల స్వచ్చంద సంస్థ, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ కు మానవ అక్రమ రవాణా, సైబర్ ట్రాఫికింగ్, అక్రమ రవాణా చట్టాలపై ఒక రోజు శిక్షణ కార్యక్రమంను నిర్వహించారు. యువత సోషల్ మీడియా మోజులో పడి తమకాలంతో పాటు నేరాల ఉచ్చులో చిక్కుకుంటున్నారన్నారు. పేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్ చాట్, మెసేంజర్ లాంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు, సైబర్ ట్రాఫికర్స్ ఫొటోలను డౌన్లోడ్ చేసి, మార్ఫింగ్ చేసి, అమ్మాయిలను మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయన్నారు.
బాధిత మహిళలకు అంగన్వాడీ టీచర్స్ అండగా నిలవాలన్నారు. మదర్స్ మీటింగ్ లలో సైబర్ నేరాలు జాగ్రత్తలపై చైతన్యం చేయాలని కోరారు. ఏదైనా సమస్యలు వస్తే 1930 సైబర్ టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించాలన్నారు. ఆడపిల్లల మహిళల రక్షణ కోసం ప్రజ్వల స్వచ్చంద సంస్థ స్థాపించబడిందన్నారు. పద్మశ్రీ డాక్టర్.సునీత కృష్ణన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు సుమారు 35 వేల మంది యువతులను, చిన్న పిల్లలను కాపాడి పునరావాసం కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజ్వల కో ఆర్డినేటర్లు భూపాల్, నాగరాణి ఐసీడీఎస్ సూపర్ వైజర్లు సత్య షీలా, దేవేంద్ర, కృష్ణ కుమారి పాల్గొన్నారు.