Kiran Abbavaram | టాలీవుడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) గతేడాది క సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. కాగా ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం దిల్రుబా సినిమాలో నటిస్తుండగా.. ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్ కాకముందే కొత్త సినిమా ప్రకటించేశాడు కిరణ్ అబ్బవరం.
మజాకా సినిమాకు తెరకెక్కిస్తున్న హస్య మూవీస్ బ్యానర్లో కొత్త సినిమా ప్రకటించాడు. ఈ సినిమా కిరణ్ అబ్బవరానికి 11వది కాగా.. హాస్య మూవీస్‌కు ఏడో సినిమా. అంతేకాదు ఈ మూవీ పూజా కార్యక్రమం రేపు ఉదయం 8:15 గంటలకు రామానాయుడు స్టూడియోలో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. దర్శకుడు, టైటిల్‌తోపాటు నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై రేపు క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
A story that will carve a majestic space in your list of all-time favourites❤️🔥
Young sensation @Kiran_Abbavaram and the successful production house @HasyaMovies teams up to bring a narrative brimming with heartfelt emotions 🫶#KiranAbbavaraam11 x #Hasya7 Title & Pooja… pic.twitter.com/j0Exq5AR2s
— BA Raju’s Team (@baraju_SuperHit) February 2, 2025
Game Changer | రాంచరణ్ అభిమానులకు ఎస్ థమన్ సారీ.. గేమ్ ఛేంజర్ గురించి ఏం చెప్పాడంటే..?
THE PARADISE | ఫిబ్రవరి.. జిమ్ సెషన్ స్టిల్‌తో నాని ఇచ్చిన హింట్ ఇదే