Air India flight | ఇజ్రాయెల్ గగనతలం మూసివేత.. మార్గమధ్యలోనే వెనక్కి తిరిగొచ్చిన ఎయిరిండియా ఫ్లైట్
Air India flight | ఇరాన్ (Iran) పై ఇజ్రాయెల్ (Israel) దాడులు చేయడంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌తోపాటు వాటి పరిసర దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. దాంతో ఇవాళ ఉదయం దేశ రాజధాని ఢిల్లీ (Delhi) నుంచి ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం మార్గం మధ్యంలోనే వెనక్కి తిరిగి వచ్చేసింది.
Air India flight : ఇరాన్ (Iran) పై ఇజ్రాయెల్ (Israel) దాడులు చేయడంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌తోపాటు వాటి పరిసర దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. దాంతో ఇవాళ ఉదయం దేశ రాజధాని ఢిల్లీ (Delhi) నుంచి ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం మార్గం మధ్యంలోనే వెనక్కి తిరిగి వచ్చేసింది.
ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాన్ని తిరిగి ఢిల్లీకే రప్పించినట్లు అధికారులు తెలిపారు. ఇరాన్‌పై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అధికారికంగా ధృవీకరించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని యూనివర్సిటీ స్ట్రీట్, జోమ్హౌరీ జిల్లాల్లో క్షిపణి దాడులు జరిగినట్లు, అక్కడ భారీ పేలుళ్లు వినిపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కీలక ప్రభుత్వ భవనాలు ఉన్న పాశ్చర్ స్ట్రీట్ సమీపంలో దట్టమైన పొగలు అలుముకున్న దృశ్యాలు కనిపించాయి.
అయితే ఆస్తి, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. మరోవైపు తాము పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. యుద్ధ వాతావరణం కారణంగా ఆ ప్రాంతంలో గగనతలాన్ని పాక్షికంగా మూసివేయడంతో పలు అంతర్జాతీయ విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
కజకిస్థాన్ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన విమానాన్ని బాకుకు మళ్లించారు. షార్జా-మాస్కో విమానాన్ని పాకిస్థాన్ గగనతలం మీదుగా దారి మళ్లించారు. చికాగో నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం సిరియా మీదుగా ప్రయాణించింది. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్లు మోగించారు. ముందు జాగ్రత్త చర్యగా దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేశారు.
ప్రజలను ఇళ్ల నుంచే పని చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో గుమికూడవద్దని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆదేశించింది. జెనీవాలో అమెరికా, ఇరాన్ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్న కీలక సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

