THE PARADISE | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటిస్తోన్న Nani Odela 2. ది ప్యారడైజ్ (THE PARADISE) టైటిల్‌తో వస్తోంది. హింస, రక్తపాతం, తుపాకులు. గ్లోరీ, ఒక మనిషి.. అంటూ ఇప్పటికే నాని- శ్రీకాంత్ ఓదెల టీం విడుదల చేసిన లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
తాజాగా జిమ్ సెషన్లో చెమటోడుస్తున్నాడు నాని. ఈ స్టిల్‌ను షేర్ చేస్తూ ఫిబ్రవరి అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. లాంగ్ హెయిర్, కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్న నాని ది ప్యారడైస్ సినిమా కోసం ఇలా వర్కవుట్ సెషన్లో ఉన్నాడంటూ అందరూ తెగ చర్చించుకుంటున్నారు.ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మెయిన్ విలన్‌గా కనిపించబోతున్నాడని వార్తలు రాగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇంతకీ ఈ చిత్రంలో నాని ఎలాంటి పాత్రలో చూపించబోతున్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. నాని మరోవైపు హిట్ ఫేం శైలేష్ కొలను డైరెక్షన్లో మూడో పార్ట్ హిట్ 3 కూడా చేస్తున్నాడని తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
Union Budget 2025 | గంటా 15 నిమిషాల పాటు కొనసాగిన నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం