Post Mortem | ఓదెల, మార్చి 5: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో కనికి రెడ్డి బాబు(61) ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. అయితే కనికిరెడ్డి బాబు మృతిపై కుటుంబ సభ్యులకు అనుమానాలు రావడంతో పూడ్చిపెట్టిన శవాన్ని 12 రోజుల తర్వాత బయటకు తీసి గురువారం పోస్టుమార్టం నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే.. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి అయిన బాబు తన వ్యవసాయ పొలంలో పశువులకు గడ్డి కోయడానికి వెళ్లాడు. అయితే బాబు అక్కడ మృతి చెంది ఉండడాన్ని గమనించిన పరిసర పొలం రైతు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా బాబు గుండెపోటుతో మరణించినట్లు మొదటగా భావించారు.
అయితే బాబు శరీరంపై ఒకటి, రెండు చోట్ల గాయాలు కల్పించినట్లు కుటుంబ సభ్యులు ఆలస్యంగా గమనించారు. ఆ అనుమానం మూడు రోజుల తర్వాత మరింత బలపడడంతో బాబు మృతిలో ఏదో మిస్టరీ ఉందని, పూడ్చివేసిన శవానికి పోస్టుమార్టం జరిపించాలని పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గురువారం పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీయించి డాక్టర్లతో పోస్టుమార్టం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ గౌడ్, ఓదెల తహసిల్దార్ ధీరజ్ కుమార్ గౌడ్, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. కాగా ఓదెలలో పూడ్చిన శవానికి పోస్టుమార్టం నిర్వహించిన విషయం కలకలం రేపుతోంది. బాబు మృతి గుండెపోటేనా..? లేక ఎవరైనా హత్య చేశారా.. ? అనే విషయమై గ్రామస్తుల్లో చర్చ జరుగుతుంది. పోస్టుమార్టం నివేదికపై కుటుంబ సభ్యులు, గ్రామస్తుల్లో ఉత్కంఠ నెలకొంది.

Loco Pilot Refuses To Work | పని గంటలు ముగిశాయని.. రైలు నడిపేందుకు నిరాకరించిన లోకో పైలట్
Iran Minister Abbas Araghchi: భారత అతిథిపై దాడి చేశారు: ఇరాన్ మంత్రి అబ్బాస్
Kalyana Kanuka | ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన బీఆర్ఎస్ సర్పంచ్