Thandel | టాలీవుడ్ యాక్టర్ నాగచైతన్య హీరోగా నటిస్తోన్న చిత్రం తండేల్ (Thandel). సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. చందూమొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం. 2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోన్న ఈ మూవీని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సాయిపల్లవి, నాగచైతన్య తీసుకుంటున్న రెమ్యునరేషన్లకు సంబంధించి ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.
తాజా టాక్ ప్రకారం తండేల్ చిత్రానికి నాగచైతన్య రూ.15 కోట్లు తీసుకుంటుండగా.. సాయి పల్లవి రూ.5 కోట్లు తీసుకుంటున్నట్టు ఫిలింనగర్ సర్కిల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఇక చైతూ కెరీర్లోనే ఈ చిత్రానికి టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. మరోవైపు సాయిపల్లవి తీసుకుంటున్న రెమ్యునరేషన్ కూడా ఆమె కెరీర్లోనే టాప్ కావడం విశేషం. .
ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తండేల్ నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. తండేల్‌లో సాయిపల్లవి శ్రీకాకుళం అమ్మాయి సత్య పాత్రలో కనిపించనుంది. సాయిపల్లవి పాత్ర ప్రేక్షకులకు చిరస్థాయిగా గుర్తుండిపోతుందని ఇప్పటివరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, ట్రైలర్ చెబుతున్నాయి. తండేల్ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన బుజ్జి తల్లి సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది.
Kiran Abbavaram | అప్పుడే కొత్త సినిమా.. కిరణ్ అబ్బవరం ఈ సారి ఎవరితో చేస్తున్నాడో తెలుసా..?
Game Changer | రాంచరణ్ అభిమానులకు ఎస్ థమన్ సారీ.. గేమ్ ఛేంజర్ గురించి ఏం చెప్పాడంటే..?
THE PARADISE | ఫిబ్రవరి.. జిమ్ సెషన్ స్టిల్‌తో నాని ఇచ్చిన హింట్ ఇదే