Prithviraj Sukumaran | బాహుబలి ప్రాంఛైజీతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు టాలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రభాస్ (Prabhas). ప్రొఫెషనల్‌గా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను లైన్లో పెట్టి ఫుల్ బిజీగా ఉన్నాడని తెలిసిందే. వరల్డ్ వైడ్‌గా సూపర్ క్రేజ్ సంపాదించినప్పటికీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటాడు ప్రభాస్. తన వ్యక్తిగతజీవితానికి సంబంధించిన విషయాలను అత్యంత అరురుగా షేర్ చేసుకుంటుంటాడు. సినిమాల రిలీజ్ టైంలోనే ఎక్కువగా బయట కనిపిస్తుంటాడు.
కాగా ప్రభాస్ పర్సనల్ లైఫ్‌లో ఎలా ఉంటాడో చెప్పి అభిమానులను ఖుషీ చేస్తున్నాడు ప్రభాస్ కోస్టార్, మాలీవుడ్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తాజా ఇంటర్వ్యూలో పృథ్విరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. ప్రభాస్ తన జీవితంలోని ఆనందాలను ఎలా పొందుతాడో పృథ్విరాజ్ సుకుమారన్ చెప్పాడు. ప్రభాస్ సాహో విడుదలకు ముందు ఏప్రిల్ 2019లో ఇన్స్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేశాడని తెలిసిందే. దీని గురించి షాకింగ్ విషయం చెప్పాడు పృథ్విరాజ్. ప్రభాస్ నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠమేంటంటే..? మీ స్టార్ డమ్ ద్వారా మీరు ఏం చేయగలుగుతారో తెలియకపోవడమే. ప్రభాస్‌కు సోషల్ మీడియా లేదు. అతనికి స్టార్డమ్తో ఉన్న ఆనందం పట్ల ఎలాంటి అవగాహన లేదన్నాడు.
ప్రభాస్ తన ఫాంహౌస్‌లో సంతోషంగా ఉంటాడు. అంతేకాదు మనం అడివికి వెళ్దాం. అక్కడ మొబైల్ రేంజ్ ఉండదు. చాలా చెట్లుంటాయి. వయనాడ్‌కు వెళ్దామా..? అంటాడు. ఇండియాలో వన్ ఆఫ్ ది బిగెస్ట్ స్టార్‌గా ఉన్న ప్రభాస్.. ఇలాంటి చిన్న చిన్న పనులతో ఆనందాన్ని పొందడం ఆశ్చర్యంగా ఉందని పృథ్విరాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చాడు. ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ సలార్ 2లో మళ్లీ కనిపించబోతున్నారని తెలిసిందే.
మిమ్మల్ని అందరినీ నిరాశ పరుస్తున్నందుకు క్షమించండి. ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేస్తున్న పోస్టులన్నీ.. ఆయన షేర్ చేస్తున్నవి కావని నాకు తెలుసునంటూ షాకింగ్ విషయం చెప్పాడు. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు ఎవరు పోస్ట్ పెడితే ఏంటీ ప్రభాస్ గురించే కదా అంటూ మురిసిపోతున్నారు.
Super Subbu | సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా సందీప్ కిషన్.. ‘సూపర్ సుబ్బు’ టీజర్ చూశారా.!
Fauji | ప్రభాస్ ఫౌజీ లాంగ్ షెడ్యూల్ ప్లాన్.. షూటింగ్ ప్లేస్ ఇదేనట..!
Thandel | తండేల్కు నాగచైతన్య, సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్స్.. ఎంతో తెలుసా..?