Super Subbu | ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ తెలుగులో ఫస్ట్ వెబ్ సిరీస్‌ను ప్రకటించింది. ఇప్పటికే బాలీవుడ్లో సాక్రేడ్ గేమ్స్, ఢిల్లీ క్రైమ్, బాంబే బేగమ్స్, రానా నాయుడు, కాలాపానీ, హిరామండీ, వంటి వెబ్ సిరీస్‌లను తెరకెక్కించి సూపర్ హిట్లు అందుకుంది. తాజాగా తెలుగులో ఇప్పుడు కామెడీ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తుంది నెట్‌ఫ్లిక్స్. సూపర్ సుబ్బు అంటూ వస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో టాలీవుడ్ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా.. బ్రహ్మనందం కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ టీజర్ చూస్తుంటే.. సందీప్ కిషన్ ఇందులో సెక్స్ ఎడ్యుకేషన్ అధికారిగా కనిపించబోతున్నాడు. మాకిపూర్ అనే గ్రామంలో అక్కడి ప్రజలు విచ్చలవిడిగా పిల్లలను కంటూ ఉంటారు. అయితే వీరికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌తో పాటు సెక్స్ ఎడ్యుకేషన్ మీదా ఆవగాహన పెంచడానికి ప్రభుత్వం అతడిని నియమించినట్లు తెలుస్తుంది. ఫుల్ హిలేరియస్‌గా మారిన ఈ టీజర్‌ను మీరు చూసేయండి. బర్నింగ్ స్టార్ సంపుర్ణేష్ బాబు, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. నరుడా డోనరుడా, టిల్లు స్క్వేర్ చిత్రాల దర్శకుడు మల్లిక్ రామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.