Pushpa 2 The Rule | ఐకాన్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్ పోషించిన సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 5న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబడుతూ టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచింది. ఇప్పటికే థియేటర్లను షేక్ చేస్తున్న పుష్పరాజ్ ఓటీటీలో కూడా సందడి చేస్తున్నాడని తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ను అభిమానించే బెంగాలీ మూవీ లవర్స్, అభిమానుల కోసం అదిరిపోయే అప్డేట్ అందించారు మేకర్స్.
ఈ చిత్రం ఇప్పటికే థియేటర్లలో బెంగాలీలో విడుదలైన తొలి తెలుగు సినిమాగా అరుదైన ఫీట్ నమోదు చేసిందని తెలిసిందే. కాగా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. పుష్ప 2 ది రూల్ మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు బెంగాలీ వెర్షన్లో కూడా విడుదల చేశారు. మిగిలిన భాషలతోపాటు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకేంటి మరి సినిమాపై మీరూ ఓ లుక్కేయండి.
థియేటర్లలోకి వచ్చిన తొలి రోజు నుంచే రికార్డు వసూళ్లతో ట్రెండింగ్ టాపిక్‌గా నిలిచింది పుష్ప 2 ది రూల్. పుష్ప 2 ఇప్పటికే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ. 1,800 కోట్లకు పైగా వసూలు చేసి ఇండియన్ ఫిలిం హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన (జాతీయ) చిత్రంగా తన హోదాను పదిలం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ మూవీలో కన్నడ సోయం రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. ఫహద్ ఫాసిల్, రావు రమేష్, జగపతి బాబు, అజయ్, అనసూయ భరద్వాజ్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. షణ్ముఖ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సీక్వెల్‌కు దేవీ శ్రీ ప్రసాద్, సామ్ సిఎస్ అద్భుతమైన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.
Super Subbu | సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా సందీప్ కిషన్.. ‘సూపర్ సుబ్బు’ టీజర్ చూశారా.!
Fauji | ప్రభాస్ ఫౌజీ లాంగ్ షెడ్యూల్ ప్లాన్.. షూటింగ్ ప్లేస్ ఇదేనట..!
Thandel | తండేల్కు నాగచైతన్య, సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్స్.. ఎంతో తెలుసా..?