రుద్రంపూర్‌లో మత సామరస్యం
''మతాలు మనుషులను వేరు చేయవు.. మనసులు కలిసినప్పుడు సమాజం ఒక్కటిగా నిలుస్తుంది” అనే సందేశాన్ని ఇఫ్తార్ కార్యక్రమం మరోసారి చాటి చెప్పింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీకి చెందిన
రుద్రంపూర్, మార్చి 06 : ”మతాలు మనుషులను వేరు చేయవు.. మనసులు కలిసినప్పుడు సమాజం ఒక్కటిగా నిలుస్తుంది” అనే సందేశాన్ని ఇఫ్తార్ కార్యక్రమం మరోసారి చాటి చెప్పింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీకి చెందిన సందిరి గోపాల్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. మత సామరస్యానికి, మానవతా విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా గోపాల్‌ను గ్రామస్తులు స్మరించుకుంటారు. మొహర్రం మాసంలో నిర్వహించే పీరీల కార్యక్రమాల్లో ఆయన భక్తిశ్రద్ధలతో పాల్గొనడమే కాకుండా వాటి నిర్వహణలో కూడా ముందుండేవాడు. తండ్రి చూపిన అదే మానవత మార్గాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారుడు సందిరి కిరణ్ రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా రుద్రంపూర్ మసీదు వద్ద ముస్లిం సోదరుల కోసం శుక్రవారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశాడు. ఉపవాస విరామ సమయంలో ముస్లింలు ప్రార్థనల అనంతరం ఇఫ్తార్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మసీదు పెద్దలు అబ్దుల్ భాషిద్, మసీద్ మౌలానా మజార్, సోను భాయ్, షమీం, కరీం, షాకీర్, సమీర్, ఫారుక్, ఉమర్, మునవర్, అజార్, సాయిరామ్, శంకర్, శ్రీనివాస్, కొండరాజు, మైల కృష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

