అరకొర జీతాలకి వృత్తి పన్నులా? : టీపీటీఎఫ్
ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందికి వృత్తి పన్నులు వసూలు చేయాలని తెలంగాణ పాఠశాలల విద్యాశాఖ ఆదేశించడం విడ్డురంగా ఉందని, బేషరతుగా ఈ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని లేకుంటే ప్రైవేట్ టీచర్లు ఏకమై..
దేవరకొండ రూరల్, మార్చి 06 : ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందికి వృత్తి పన్నులు వసూలు చేయాలని తెలంగాణ పాఠశాలల విద్యాశాఖ ఆదేశించడం విడ్డురంగా ఉందని, బేషరతుగా ఈ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని లేకుంటే ప్రైవేట్ టీచర్లు ఏకమై పన్ను వ్యతిరేక, ప్రభుత్వ పనితీరును తీవ్రంగా ప్రతిఘటిస్తామని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు ఎండీ. రంజాన్ బేగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ ఉపాధ్యాయులని కానీ సిబ్బందిని కానీ ఎప్పుడూ పట్టించుకోని ప్రభుత్వం వారికి పీఎఫ్, హెల్త్ కార్డు విషయం, పని వేళలను గానీ ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. భయానక కొవిడ్ కాలంలో తీవ్రంగా ఉద్యమిస్తే రెండు నెలలు రేషన్ బియ్యం, ఒక నెల రూ.2 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు వెల్లడించారు. ఆ రెండు సంవత్సరాలు ప్రైవేట్ టీచర్లు ఎంత దయనీయంగా బతుకులు వెళ్లదీశారో తెలిసిందేనన్నారు. నాడు వారిని ఆదుకోని ప్రభుత్వం టీచర్ల సంక్షేమం గాలికి వదిలి వృత్తిపన్ను కట్టమనడం దుర్మార్గమైనది అని తీవ్రంగా ఖండించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

