Akkineni Nagarjuna | టాలీవుడ్ మూవీ లవర్స్‌తో అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తండేల్ (Thandel) ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)-సాయిపల్లవి (Sai Pallavi) హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.
చందూ మొండేటి డైరెక్షన్లో రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతున్న నేపథ్యంలో అక్కినేని నాగార్జున సెలబ్రేషన్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. తన కొడుకు చైతూ విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రశంసలతో ముంచెత్తాడు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేశాడు నాగార్జున.
నాగచైతన్య.. నా కొడుకుగా నిన్ను చూసి గర్వపడుతున్నా. తండేల్ మరో సినిమా మాత్రమే కాదు. ఇది నీ ఎనలేని అభిరుచికి, నీ కృషికి, పెద్ద కలలు కనే ధైర్యానికి నిదర్శనం. అక్కినేని అభిమానులందరు ఓ కుటుంబంలా మాకు అండగా నిలిచారు. తండేల్ విజయం మనందరిదీ. మీ అంతులేని ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. అల్లుఅరవింద్, బన్నీ వాసుకు ధన్యవాదాలు. సాయిపల్లవి అద్భుతమైన టాలెంట్ ఆశ్చర్యానికి లోను చేస్తుంది. ఈ క్షణాలను మరిచిపోలేని విధంగా చేసిన చందూమొండేటి, రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్, అద్భుతమైన తండేల్ బృందానికి అభినందనలు అని ఎక్స్‌లో ట్వీట్ చేశాడు నాగార్జున.
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వచ్చిన తండేల్ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించారు. ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు..
Dear @chay_akkineni, Proud of you my son!❤️ I have watched you push boundaries, face challenges, and give your heart to the craft. Thandel is not just another film—it is a testament to your relentless passion, your courage to dream big, and your hard work. 💐 ✨ ✨ ❤️
To all… pic.twitter.com/cE9u2EKaTn
— Nagarjuna Akkineni (@iamnagarjuna) February 9, 2025
Ram Gopal Varma | సారీ ప్రమోషన్స్‌తో బిజీ.. విచారణకు రాలేనన్న రాంగోపాల్ వర్మ..!
L2 Empuraan | తొలి సినిమాగా.. రిలీజ్‌కు ముందే మోహన్ లాల్ L2E అరుదైన రికార్డ్