Jr NTR | వెన్నెల సినిమాతో నటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు రవి వర్మ (Ravi Varma). ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రాఖీ సినిమాతో సూపర్ ఫేం సంపాదించాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ ఓ చిట్ చాట్ సెషన్లో పాల్గొన్నాడు. చాలా రోజుల తర్వాత రాఖీ (Rakhi) సినిమా షూటింగ్ టైంలో జరిగిన ఓ ఫన్నీ విషయాన్ని చిట్‌చాట్‌లో షేర్ చేసుకున్నాడు. ఇండస్ట్రీలో ఉన్న స్నేహితుల గురించి యాంకర్ రవి వర్మను అడిగింది.
మేం ఎక్కువ సమయం జూనియర్ ఎన్టీఆర్‌ను రాఖీ టైంలోనే కలవడం.. ఆ తర్వాత నేను యమదొంగ సెట్స్‌కు రెండుమూడు సార్లు వెళ్లాను. కొంత సమయం అక్కడే ఉన్నా.. ఆ టైంలో కొంత దోస్తీ ఉండేది.. ఆ తర్వాత నేను యూఎస్ వెళ్లిపోవడం ఆయనతో పనిచేయలేకపోవడం జరిగింది. ఆయనకు నేను వ్యక్తిగతంగా స్నేహితుడిని కాదు.. కానీ వర్క్ ప్లేస్‌లో ఉంటే మాత్రం కోస్టార్‌గా మంచి అసోసియేషన్ ఉండేది.
రాఖీ టైంలో ఎలా ఉండేవారంటే.. మీరిద్దరు ఏం మాట్లాడుకునేవారని అడుగగా.. దీనికి రవి వర్మ స్పందిస్తూ ఆసక్తికర విషయమేంటంటే నా వయస్సు 49.. ఎన్టీఆర్ చాలా యువకుడిగా ఉన్న సమయంలో సెయింట్ మెరిస్ డిగ్రీ కాలేజ్‌కు వెళ్లాడు. ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ నా క్లాస్మేట్. ఏంటీ నువ్వు మహేందర్ రెడ్డిగారి క్లాస్మేటా..? ఇంతకీ నీ వయస్సెంత అని అడిగాడు. మొదటిసారి ఎన్టీఆర్ షాకయ్యాడు. ఆ టాపిక్ వద్దన్నా. బాగా గుర్తున్న ఇంకో విషయమేంటంటే..? ఓ సీన్లో ఎన్టీఆర్ బావ కాళ్లు పట్టుకోవాలి.
బావ ప్లీజ్ నా చెల్లి జాగ్రత్త అని.. అందుకే తారక్ నేనొచ్చి నీ కాళ్లు పట్టుకోవాలా.. అంటూ ర్యాగింగ్ చేస్తే గురువు గారు నాకేం సంబంధం లేదు.. కావాలంటే డైరెక్టర్‌ను అడగండి.. నన్ను లాగొద్దు.. మీరూ మీరూ చూసుకోండి.. అని చెప్పా. ఇలా కాదు సినిమా రిలీజ్ రోజురవిని తీసుకురండి. మనతోపాటే సినిమా చూస్తాడు. ముందు వరుసలో నిలబెట్టి కాళ్లు పట్టుకునే చూస్తానన్నాడు. అంత ఆఫర్ నాకెందుకు నా స్థానంలో నేనుండి చూస్తా. రాఖీ రిలీజ్ రోజు మాత్రం మీతో నేనుండనని చెప్పేశా. ఆయన చాలా అద్భుతమైన నటుడంటూ చెప్పుకొచ్చాడు.
Read Also :
L2 Empuraan | తొలి సినిమాగా.. రిలీజ్‌కు ముందే మోహన్ లాల్ L2E అరుదైన రికార్డ్
Sairam Shankar | విలన్ ఎవరో చెప్పండి.. రూ.10 వేలు గెలుచుకోండి.. సాయి రామ్ శంకర్ బంపర్ ఆఫర్