Priyanka Chopra | ఎస్ఎస్ రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29 (SSMB29)లో బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుందని తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ రామోజీఫిలింసిటీలో కొనసాగుతున్నట్టు సమాచారం. కాగా ప్రియాంకా చోప్రా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని తన సోదరుడు సిద్దార్థ్ చోప్రా వెడ్డింగ్ కోసం ముంబై వెళ్లిందని తెలిసిందే.
సిద్దార్థ్ చోప్రా, నీలం ఉపాధ్యాయ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా నిర్వహించే సంగీత్ సెర్మనీ కోసం ప్రియాంకా చోప్రా తన ఫ్యామిలీ మెంబర్స్‌తో ట్రైనింగ్ సెషన్లో పాల్గొన్నది. ప్రియాంకా చోప్రా జుహూలోని తన సోదరుడి ఇంటికి సంప్రదాయ వస్త్రధారణలో వెళ్లింది. ఈ విజువల్స్తోపాటు ట్రైనింగ్ స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అనంతరం మళ్లీ ఎస్ఎస్ఎంబీ 29 షూట్లో పాల్గొనున్నట్టు సమాచారం.
ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 29 మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ తెరకెక్కిస్తున్నారు. తాజా కథనాల ప్రకారం ఈ సినిమా కోసం ప్రియాంకా చోప్రా ఏకంగా రూ.30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం.
#PriyankaChopra trains for Sangeet with her family ahead of the wedding of her brother #SiddharthChopra with actress #NeelamUpadhyaya. pic.twitter.com/wSrfBqdW70
— Cinemania (@CinemaniaIndia) February 3, 2025
Sairam Shankar | విలన్ ఎవరో చెప్పండి.. రూ.10 వేలు గెలుచుకోండి.. సాయి రామ్ శంకర్ బంపర్ ఆఫర్
Pushpa 2 The Rule | పుష్పరాజ్ మేనియా కంటిన్యూ.. ఇక మరో భాషలో అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్..!
Thandel | తండేల్కు నాగచైతన్య, సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్స్.. ఎంతో తెలుసా..?