అమీర్పేట, ఫిబ్రవరి 11: బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో (Balkampet Temple) నకిలీ టికెట్ల వ్యవహారంలో ఉద్యోగిపై వేటుపడింది. నకిలీ టికెట్లను ప్రింట్ చేయించి అమ్ముతున్న శ్రీహరిని సస్పెండ్ చేసినట్లు ఆలయ ఈవో బీ.కృష్ణ తెలిపారు. ఈ వ్యవహారంలో విచారణ ఇంకా కొనసాగుతున్నదని, అమ్మవారి ఆలయంలో అవకతవకలకు పాల్పడేవారు ఎంటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సాఫ్ట్ లోపమా లేదా ఉద్యోగి తప్పిదమా అనే విషయమై తమ దృష్టికి వచ్చిన వెంటనే విచారణ ప్రారంభించామన్నారు. ప్రాథమిక ఆధారల నేపథ్యంలో శ్రీహరిని ఈ నెల 4న సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
గత నెల 12న బల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయంలో నకిలీ టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆలయ టికెట్ కౌంటర్లో పని చేస్తున్న శ్రీహరి గత పదేళ్లుగా నకిలీ టికెట్లను ప్రింట్ చేయించి అమ్ముతూ అడ్డదారిలో డబ్బు సంపాదిస్తున్నట్లు తేలింది. ఆ ఒక్క రోజే నకిలీ టికెట్ల ద్వారా సుమారు రూ.31 వేలు వసూలైనట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రింటింగ్లో పొరపాటు జరిగిందని చెప్పి ఆలయ సూపరింటెండెంట్ చేదులు దులుపుకున్నాయి. కాగా, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మాడటంతో అప్రమత్తమైన ఆలయ ఈవో.. ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ జరిపారు. తాజాగా శ్రీహరిపై చర్యలు తీసుకున్నారు.