Amanatullah Khan : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓఖ్లా అసెంబ్లీ స్థానం (Okhla Assembly seat) నుంచి కొత్తగా ఎన్నికైన ఆప్ ఎమ్మెల్యే (AAP MLA) అమానతుల్లా ఖాన్ (Amanathulla Khan) అరెస్టుకు రంగం సిద్ధమైంది. హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న షాబాజ్ ఖాన్ (Shabaz Khan) అనే వ్యక్తిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీస్ టీమ్ (Police Team) ను సోమవారం జామియా నగర్ (Jamia Nagar) లో అమానతుల్లా ఖాన్ తన అనుచరులతో కలిసి అడ్డుకున్నాడని, పోలీసులపై దగ్గరుండి దాడి చేయించాడని ఢిల్లీ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు.
ఇవాళ ఉదయం ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు ఓఖ్లాలోని అతని నివాసానికి వెళ్లారు. కానీ ఆయన ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆయన జాడ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. కాగా హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న షాబాజ్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేయడానికి క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సునీల్ కల్ఖండే నేతృత్వంలోని పోలీసులు సోమవారం జామియా నగర్ ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆప్ ఎమ్మెల్యే ఖాన్, అతని మద్దతుదారులు పోలీసులను అడ్డకున్నారు. పోలీస్ టీమ్‌పై దాడి చేసి నిందితుడు తప్పించుకోవడానికి సహకరించారు.
అమానతుల్లా ఖాన్ ఓఖ్లా అసెంబ్లీ స్థానం నుంచి 23 వేల పైచిలుకు ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి మనీశ్ చౌధరిపై ఘన విజయం సాధించారు. మనీశ్ చౌధరికి మొత్తం 65,304 ఓట్లు రాగా.. ఖాన్ 88,943 ఓట్లు సాధించారు.
Bandla Ganesh | నోటి దూలతో సమస్య రావడం దారుణం.. విశ్వక్సేన్ లైలా వివాదంపై బండ్ల గణేశ్
Balkampet Temple | బల్కంపేట ఆలయంలో నకిలీ శీఘ్రదర్శన టికెట్లు.. ఉద్యోగిపై వేటు
Peanuts With Skin | పల్లీలను పొట్టుతో తినాలా..? పొట్టు తీసేసి తినాలా..? ఎలా తింటే మంచిది..?