JEE Main 2025 Results : జేఈఈ మెయిన్స్ (JEE Mains) 2025 సెషన్-1 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకుని స్కోర్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ (NTA) తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ ఐఐటీలు (IITs), ఎన్ఐటీల (NITs) లో ప్రవేశాల కోసం ఏన్టీఏ జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షలను నిర్వహిస్తుంటుంది. ఇందులో జేఈఈ మెయిన్స్ రెండు సెషన్లలో ఉంటుంది. ఈ రెండింటిలో ఒక్క సెషన్లో అర్హత సాధించినా అభ్యర్థులు అడ్వాన్స్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు.
జేఈఈ మెయిన్స్ సెషన్ -1 పరీక్ష ప్రశ్న పత్రాల్లో వచ్చిన 12 ప్రశ్నలను తొలగించినట్టు ఎన్టీఏ ప్రకటించింది. అభ్యర్థులకు ఆ 12 ప్రశ్నలకు పూర్తి మార్కులు వేసినట్లు తెలిపింది. జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ -1 పరీక్షలు గత జనవరిలో ముగిశాయి. రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. ప్రస్తుతం సెషన్ -2 కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ఘులైన అభ్యర్థులు మే నెలలో జరిగే జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాసేందుకు అర్హులవుతారు.
జేఈఈ మెయిన్స్ రెండు సెషన్ల నుంచి మొత్తం 2.5 లక్షల మందిని అడ్వాన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు. జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాలు jeemain.nta.nic.in. వెబ్సైట్లో కాస్సేపట్లో అందుబాటులో ఉన్నాయి. వెబ్సైట్లోకి వెళ్లి వ్యూ స్కోర్ కార్డ్ లేదా వ్యూ జేఈఈ మెయిన్ 2025 రిజల్ట్స్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత మీ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. ఫలితాలను చూసుకుని స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Fire accident | ఫర్నీచర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. Video
Hamas | ట్రంప్ ఆ సంగతి తప్పక గుర్తుంచుకోవాలి.. అమెరికా అధ్యక్షుడి హెచ్చరికకు హమాస్ రెస్పాన్స్
Chattishgarh Elections | ఛత్తీస్‌గఢ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్
Donald Trump | ఆ లోగా బందీలందరినీ విడిచిపెట్టకపోతే.. హమాస్‌కు డొనాల్డ్ ట్రంప్ డెడ్‌లైన్
Amanatullah Khan | పోలీసులపై దాడి కేసు.. ఆప్ ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం
Bandla Ganesh | నోటి దూలతో సమస్య రావడం దారుణం.. విశ్వక్సేన్ లైలా వివాదంపై బండ్ల గణేశ్
Balkampet Temple | బల్కంపేట ఆలయంలో నకిలీ శీఘ్రదర్శన టికెట్లు.. ఉద్యోగిపై వేటు
Peanuts With Skin | పల్లీలను పొట్టుతో తినాలా..? పొట్టు తీసేసి తినాలా..? ఎలా తింటే మంచిది..?