Hamas : ఇజ్రాయెలీ బందీలను వచ్చే శనివారం మధ్యాహ్నం 12 గంటలలోగా విడిచిపెట్టాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, యుద్ధ విరమణ ఒప్పందాన్ని రద్దు చేస్తామని అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన హెచ్చరికలపై హమాస్ (Hamas) మిలిటెంట్స్ స్పందించారు. యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఇరువర్గాలు గౌరవించాలనే విషయాన్ని ట్రంప్ తప్పక గుర్తుంచుకోవాలని హమాస్ నేత సమీ అబూ జుహ్రి (Sami Abu Zuhri) వ్యాఖ్యానించారు.
బెదిరింపు పదజాలానికి ఎలాంటి విలువ ఉండదని, అది విషయాన్ని మరింత జఠిలం చేస్తుందని జుహ్రి అన్నారు. రెండు వైపుల ఉన్న బందీలు విడుదల కావాలంటే ఇరువర్గాలు యుద్ధ విరమణ ఒప్పందాన్ని గౌరవించడం ఒక్కటే మార్గమని ఆయన పేర్కొన్నారు. కాగా ఇజ్రాయెలీ బందీలను విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్ రెబెల్స్ గ్రూప్‌కు డెడ్‌లైన్ విధించారు. హమాస్ మాట వినకపోతే యుద్ధ విరమణ ఒప్పందాన్ని రద్దు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఇచ్చారు.
యుద్ధ విరమణ ఒప్పందం ప్రకారం.. హమాస్ గత మూడు వారాల నుంచి ప్రతి శనివారం తన వద్ద బందీలుగా ఉన్న వారిని విడుదల చేస్తోంది. గత శనివారం కూడా బందీల విడుదల ఉంటుందని అంతా ఆశించారు. బందీల కుటుంబసభ్యులు కూడా వారి కోసం ఎదురుచూశారు. అయితే హమాస్ బందీలను విడుదల చేయలేదు. దాంతో బందీల కుటుంబసభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. టెల్ అవీవ్‌లో ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో హమాస్ తక్షణమే బందీలను విడుదల చేయాలని, లేకపోతే తీవ్ర మూల్యం చెల్లించాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు.
శనివారం మధ్యాహ్నం 12 గంటల లోపు బందీలను విడుదల చేయకపోతే యుద్ధ విరమణ ఒప్పందం రద్దుకు ఇదే సరైన సమయం అవుతుందని ట్రంప్ హెచ్చరించారు. అంతేగాక గాజా శరణార్థులను తమ దేశంలోకి రానీయకుండా జోర్డాన్, ఈజిప్ట్ అడ్డుకుంటే అమెరికా నుంచి వారికి అందుతున్న సాయాన్ని నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు. అదేవిధంగా గాజాకు పాలస్తీనియన్ల తిరిగి రాకను అంగీకరించబోమని స్పష్టంచేశారు. కాగా గాజాలో దాదాపు 15 నెలల పాటు యుద్ధం కొనసాగిన అనంతరం జనవరి 19 నుంచి హమాస్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధ విరమణ ఒప్పందం అమలులోకి వచ్చింది.
Chattishgarh Elections | ఛత్తీస్‌గఢ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్
Donald Trump | ఆ లోగా బందీలందరినీ విడిచిపెట్టకపోతే.. హమాస్‌కు డొనాల్డ్ ట్రంప్ డెడ్‌లైన్
Amanatullah Khan | పోలీసులపై దాడి కేసు.. ఆప్ ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం
Bandla Ganesh | నోటి దూలతో సమస్య రావడం దారుణం.. విశ్వక్సేన్ లైలా వివాదంపై బండ్ల గణేశ్
Balkampet Temple | బల్కంపేట ఆలయంలో నకిలీ శీఘ్రదర్శన టికెట్లు.. ఉద్యోగిపై వేటు
Peanuts With Skin | పల్లీలను పొట్టుతో తినాలా..? పొట్టు తీసేసి తినాలా..? ఎలా తింటే మంచిది..?