MLS Deshapathi Srinivas | పదేండ్ల కేసీఆర్ పాలనలో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి రాలేదని..ఎన్నికల ముందు చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి సమైక్య రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను తీసుకొచ్చారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నంగునూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో శనివారం ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి రంగు మెలమెల్లగా ప్రజలకు తెలిసిపోతుంది తెలంగాణ రైతులు చాలా భాధలు అనుభవించారు. గోదావరి, కృష్ణా నదులు మన దగ్గరే ఉన్నా ప్రాజెక్టులకు నోచుకోని భూమి తెలంగాణ భూమి అని.. గోదావరి పుష్కరాలు ఆంధ్రలో మాత్రమే జరిగేవన్నారు. బోర్లు వేసి కరెంట్ రాక రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఉండేవన్నారు.
జీవన్ రెడ్డి కాంగ్రెస్లో జీవన్మరణ సమస్య ఎదుర్కుంటున్నారు. కరెంట్ అడిగితే చంద్రబాబు రైతులను కాల్చి చంపిండు. ఆ పోరాటంలో నుంచి పుట్టిందే గులాబీ జెండా. నీళ్లు వస్తాయంటే రైతులకు, ప్రజలకు నాడు నమ్మకం లేకుండే. మూడు సంవత్సరాలలో 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించారు కేసీఆర్. కరెంట్ ఇచ్చాక 3 సంవత్సరాలలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారు. అశోక్ గులాటి అనే వ్యవసాయ వేత్త చెప్పినట్టుగా కేసీఆర్ రైతుబంధు ప్రవేశ పెట్టారు. 72 వేల కోట్లు రైతు బంధు ఇచ్చిన నాయకుడు కెసీఆర్. రైతు బంధు అనే పథకాన్ని దేశంతోపాటు ప్రపంచమే గుర్తించిందన్నారు. రైతుల ఆత్మగౌరవం కేసీఆర్ కాపాడారు. కరోనా కాలంలో కూడా కేసీఆర్ రైతు బంధు ఆపలేదు.. మోసం చేసుడు మా లక్షణం అని రేవంత్ రెడ్డి ముందే చెప్పిండు అయినా ప్రజలు మోసపోయారన్నారు.
మెస్సీతోని ఫుట్ బాల్ ఆడేందుకు, అందాల పోటీలు పెట్టెందుకు రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. రేవంత్ రెడ్డి ఇల్లు కంచెల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నరు. మూసీ అభివృద్ధి పేరిట కోట్ల రూపాయలు మూసీలో పోస్తుండు. ప్రజలంటే ప్రేమ ఉంది కాబట్టే హరీష్ రావు అభివృద్ధి చేశిండన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయ్యేదని.. రైతు భీమాకు కిస్తీలు కూడా కట్టడం లేదు. కంఠంలో ప్రాణం ఉండగా మీటర్లు పెట్ట అని కేసీఆర్ చెప్పిండు. ఇప్పుడు కాషాయం, కాంగ్రెస్ ఒక్కటయ్యారన్నారు.

