అమరావతి : ఏపీలోని పోలవరం( Polavaram) జిల్లాలో పెద్దపులి ( Tiger ) సంచారం కలవరానికి గురి చేస్తుంది. నిన్న, మొన్నటి వరకు గంగవరం మండలం ట్యాంకుబీడు పరిసరాల్లో సంచరించిన పులి రాత్రి అడ్డతీగల మండలం కృష్ణవరంలో ప్రవేశించి ఆవు, దూడను చంపి తిన్నది.
స్థానికుల సమాచారం మేరకు అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్దపులిని పట్టుకునేందుకు సమీప ప్రాంతాల నుంచి బోనులను రప్పించారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.