Fire accident : మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. నవీ ముంబై శివార్లలోని ఒషివారా ఏరియా (Oshiwara Area) లోగల ఫర్నీచర్ మార్కెట్ (Furniture market) లో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే 10 ఫర్నీచర్ దుకాణాలకు మంటలు విస్తరించాయి. ఆ దుకాణాల్లోని ఫర్నీచర్ పూర్తిగా అగ్ని ఆహుతైంది.
ఇంతలో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఏకంగా 20 ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. మరిన్ని దుకాణాలకు మంటలు అంటుకోకుండా అడ్డుకున్నారు. నవీ ముంబైలోని స్వామి వివేకానంద మార్గ్‌లో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగిందన్నారు.
#WATCH | Maharashtra | A fire broke out in the Furniture market in the Oshiwara area of Mumbai, More details awaited. pic.twitter.com/7DVZJ8aaQ5
— ANI (@ANI) February 11, 2025
Hamas | ట్రంప్ ఆ సంగతి తప్పక గుర్తుంచుకోవాలి.. అమెరికా అధ్యక్షుడి హెచ్చరికకు హమాస్ రెస్పాన్స్
Chattishgarh Elections | ఛత్తీస్‌గఢ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్
Donald Trump | ఆ లోగా బందీలందరినీ విడిచిపెట్టకపోతే.. హమాస్‌కు డొనాల్డ్ ట్రంప్ డెడ్‌లైన్
Amanatullah Khan | పోలీసులపై దాడి కేసు.. ఆప్ ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం
Bandla Ganesh | నోటి దూలతో సమస్య రావడం దారుణం.. విశ్వక్సేన్ లైలా వివాదంపై బండ్ల గణేశ్
Balkampet Temple | బల్కంపేట ఆలయంలో నకిలీ శీఘ్రదర్శన టికెట్లు.. ఉద్యోగిపై వేటు
Peanuts With Skin | పల్లీలను పొట్టుతో తినాలా..? పొట్టు తీసేసి తినాలా..? ఎలా తింటే మంచిది..?