e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home News మైక్రోసాఫ్ట్ చేతికి సైబ‌ర్ సెక్యూరిటీ ‘రిస్క్ ఐక్యూ’?

మైక్రోసాఫ్ట్ చేతికి సైబ‌ర్ సెక్యూరిటీ ‘రిస్క్ ఐక్యూ’?

మైక్రోసాఫ్ట్ చేతికి సైబ‌ర్ సెక్యూరిటీ ‘రిస్క్ ఐక్యూ’?

శాన్ ఫ్రాన్సిస్కో: గ్లోబ‌ల్ టెక్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్‌.. తన ఉత్ప‌త్తులూ సేవ‌ల‌ను విస్త‌రించ‌డంతోపాటు క‌స్ట‌మ‌ర్ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించే దిశ‌గా ప‌య‌నిస్తున్న‌ది. గ్లోబ‌ల్ సైబ‌ర్ దాడులు పెరిగిపోతున్న నేప‌థ్యంలో సైబ‌ర్ సెక్యూరిటీని బ‌లోపేతం చేయాల‌ని త‌ల‌పోస్తున్న‌ది. ఇందుకోసం ‘సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ మేక‌ర్‌.. రిస్క్ ఐక్యూ’ను టేకోవర్ చేసేందుకు మైక్రోసాఫ్ట్ అంగీక‌రించింద‌ని స‌మాచారం.

అది 500 మిలియ‌న్ డాల‌ర్ల డీల్‌.. కానీ..

కొద్ది రోజుల్లో రెండు సంస్థ‌ల మ‌ధ్య డీల్ కుద‌ర‌నున్న‌ద‌ని స‌మాచారం. ఇప్ప‌టికి రిస్క్ ఐక్యూ సంస్థ‌ను టేకోవ‌ర్ చేసే అంశాన్ని ఆ సంస్థ గానీ, మైక్రోసాఫ్ట్ గానీ బ‌హిరంగ ప‌ర్చ‌లేదు. అయితే, రిస్క్ ఐక్యూ స్వాధీనం చేసుకోవ‌డానికి మైక్రోసాఫ్ట్ 500 మిలియ‌న్ల డాల‌ర్లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది

ముప్పు గుర్తింపుకు రిస్క్ ఐక్యూ క్లౌడ్ సాఫ్ట్‌వేర్‌

- Advertisement -

శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ప‌ని చేస్తున్న రిస్క్ ఐక్యూ.. సెక్యూరిటీ ముప్పును గుర్తించేందుకు క్లౌడ్ సాఫ్ట్‌వేర్ త‌యారు చేసింది. కార్పొరేట్ నెట్‌వ‌ర్క్స్ అండ్ డివైజెస్ కాంప్లెక్స్ వెబ్స్‌పై సైబ‌ర్ దాడులు ఎలా జ‌రుగుతున్నాయో ఈ సాఫ్ట్‌వేర్ సాయంతో త‌న ఖాతాదారుల‌కు రిస్క్ ఐక్యూ అర్థం అయ్యేలా చేస్తుంది.

మైక్రోసాఫ్ట్ చేతికి సైబ‌ర్ సెక్యూరిటీ ‘రిస్క్ ఐక్యూ’?

ఇవీ రిస్క్ ఐక్యూ క‌స్ట‌మ‌ర్లు

రిస్క్ ఐక్యూ సంస్థ క‌స్ట‌మ‌ర్ల‌లో సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్ బుక్‌, బీఎండ‌బ్ల్యూ ఏజీ, అమెరిక‌న్ ఎక్స్‌ప్రెస్ కో, యూఎస్ పోస్ట‌ల్ స‌ర్వీస్ త‌దిత‌ర సంస్థ‌లు ఉన్నాయి. 2009తో రిస్క్ ఐక్యూ సంస్థ‌ను స్థాపించారు. ‘ఎవిల్ ఇంట‌ర్నెట్ మినిట్‌’ పేరుతో స‌మ్మిట్ పార్ట‌న‌ర్స్ అండ్ బ్యాట‌రీ వెంచ‌ర్స్ నుంచి రిస్క్ ఐక్యూ 83 మిలియ‌న్ల డాల‌ర్ల పెట్టుబ‌డులు సేక‌రించింది.

డీల్‌పై స్పందించ‌ని మైక్రోసాఫ్ట్‌.. రిస్క్ ఐక్యూ

రిస్క్ ఐక్యూను స్వాధీనం చేసుకునే విష‌య‌మై స్పందించేందుకు మైక్రోసాఫ్ట్ అధికార ప్ర‌తినిధి నిరాక‌రించారు. కానీ రిస్క్ ఐక్యూ ప్ర‌తినిధి అందుబాటులోకి రాలేదు.

వ్య‌క్తిగ‌త కంప్యూట‌ర్ల‌ను ర‌క్షించ‌డానికి, నెట్‌వ‌ర్క్‌ల‌పై అడ్డుకోవ‌డానికి విండోస్‌, దాని అజూర్ క్లౌడ్ స‌ర్వీసెస్ ఉప‌యోగంలోకి వ‌స్తాయి. దేశాల వారీగా హ్యాక‌ర్ల‌ను గుర్తించేందుకు మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ సెంట‌ర్ పేరుతో ల్యాబ్ నిర్వ‌హిస్తున్న‌ది.

మైక్రోసాఫ్ట్ త‌న సెక్యూరిటీ సామ‌ర్థ్యాన్ని విస్త‌రించేందుకు ప‌లు కంపెనీల‌ను స్వాధీనం చేసుకున్న‌ది. ఇంట‌ర్నెట్ ఆఫ్ థింక్స్ డివైజెస్ భ‌ద్ర‌త కోసం రీఫిర్మ్ ల్యాబ్స్‌ను కొనుగోలు చేసింది.

ఇవి కూడా చదవండి:

16న ఆరుగురు సీఎంల‌తో ప్ర‌ధాని మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్‌..!

స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు

య‌శ్‌పాల్ శ‌ర్మ బాదాం షాట్ గురించి మీకు తెలుసా?

రైలు ప‌ట్టాల‌పై ఫైవ్ స్టార్ హోట‌ల్‌.. ఎక్క‌డో తెలుసా?

హీరో విజ‌య్‌కి ల‌క్ష రూపాయ‌ల జ‌రిమానా..!

సెగ‌లు రేపుతున్న శ‌ర్మ సిస్ట‌ర్స్ స్టిల్స్

మెట్రో నియోకే మొగ్గు

55 కిలోమీటర్లమూసీపై 15 వంతెనలు

గోద్రెజ్‌ ఎయిర్‌ స్మార్ట్‌ మాటిక్‌ రివ్యూ : మీ ఫోన్‌తోనే ఇంటిని ఫ్రెష్‌గా చేసేయండి..

కార్పొరేట్ కొలువులు.. ల‌గ్జ‌రీ లైఫ్ వ‌దిలేసి అడ‌విలో కాపురం

దేశీ మార్కెట్‌లో మ‌హీంద్ర బొలెరో నియో లాంఛ్‌

“బీఎమ్‌డబ్ల్యూ సీఈ04” ఫీచర్స్.. అదుర్స్..

స్విఫ్ట్‌.. సీఎన్జీ కార్ల ధ‌ర‌లు పెంచిన మారుతి!

కృత్రిమ మేధపై సుంద‌ర్ పిచ్చాయ్ ఏం చెప్పారంటే..?!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మైక్రోసాఫ్ట్ చేతికి సైబ‌ర్ సెక్యూరిటీ ‘రిస్క్ ఐక్యూ’?
మైక్రోసాఫ్ట్ చేతికి సైబ‌ర్ సెక్యూరిటీ ‘రిస్క్ ఐక్యూ’?
మైక్రోసాఫ్ట్ చేతికి సైబ‌ర్ సెక్యూరిటీ ‘రిస్క్ ఐక్యూ’?

ట్రెండింగ్‌

Advertisement