మెట్రో నియోకే మొగ్గు

- కేపీహెచ్‌బీ – ఫైనాన్షియల్ డిస్ట్రిక్ – కోకాపేట మార్గంలో నిర్మాణం
- పీపీపీ విధానంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయం
- ఈ ఏడాదిలోనే పనులు చేపట్టేందుకు ప్రణాళికలు
- పురపాలక శాఖ వార్షిక నివేదికలో పొందుపర్చిన ప్రభుత్వం
- ఇక ఐటీ కారిడార్‌లో మెరుగైన ఆధునిక ప్రజా రవాణా
- నియో లో బోగీలకు బదులు ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయి. మెట్రో ప్రాజెక్టు
- తరహాలో భారీ నిర్మాణాలు, ట్రాక్‌లు వేయాల్సిన అవసరం ఉండదు.
- సాధారణ ‘మెట్రో’కు కిలోమీటర్‌కు సుమారు రూ. 250 కోట్లు ఖర్చవుతే..
- నియోను 40 % తక్కువ వ్యయంతోనే నిర్మించే అవకాశం ఉంటుంది.
నగరవాసులకు త్వరలోనే మరో అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రస్తుత రద్దీ.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా హెచ్ఎంఆర్ తరహాలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో మెట్రో నియో ప్రాజెక్టు చేపట్టాలని సర్కారు సంకల్పించింది. ఇందులోభాగంగా హైదరాబాద్ మెట్రో రైల్, యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేశాయి. ఇప్పటికే మియాపూర్ వరకు మెట్రో కనెక్టివిటీ ఉండటంతో అక్కడి నుంచి ఐటీ కారిడార్‌లోని పలు ప్రాంతాలను కలుపుతూ.. తక్కువ వ్యయం అయ్యే నియో ప్రాజెక్టును చేపడితే సరిపోతుందని సర్వేలో గుర్తించారు. కేపీహెచ్‌బీకాలనీ -గచ్చిబౌలి -కోకాపేట వరకు సుమారు 24 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించారు.
సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): విశ్వ నగరంగా మారుతున్న గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్ మెట్రో రైలు తరహాలోనే మెట్రో నియో ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్ మెట్రో రైలు సంస్థతో పాటు హెచ్ఎండీఏ పరిధిలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలు క్షేత్రస్థాయిలో అధ్యయనం నిర్వహించాయి. కేపీహెచ్‌బీ కాలనీ నుంచి హైటెక్ సిటీ మీదుగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్-కోకాపేట వరకు సుమారు 24 కిలోమీటర్ల మేర మెట్రో నియో ప్రాజెక్టును చేపట్టాలని అధికారులు అంతిమంగా నిర్ణయించారు. ఇప్పటికే నగరంలో మెట్రో రైల్ ప్రాజెక్టు ఎల్బీనగర్ నుంచి కేపీహెచ్‌బీ మీదుగా మియాపూర్ వరకు ఉండడంతో అక్కడి నుంచి ఐటీ కారిడార్‌లోని పలు ప్రాంతాలను కలుపుతూ మెట్రో నియో ప్రాజెక్టును చేపడితే సరిపోతుందని క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో గుర్తించారు.
తక్కువ వ్యయం.. వేగంగా నిర్మాణం
సాధారణంగా మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతి కిలోమీటర్‌కు సుమారు రూ.250 కోట్లు ఖర్చవుతుండగా మెట్రో నియో ప్రాజెక్టును 40 శాతం తక్కువ వ్యయంతోనే నిర్మించే అవకాశం ఉందని మెట్రో అధికారులు తెలిపారు. ఒక మార్గంలో ఒక గంటలో 25 వేల లోపు మంది ప్రయాణం చేసేందుకు మెట్రో నియో లాంటి ప్రాజెక్టులు సరిపోతాయని అధికారులు పేర్కొంటున్నారు. అందుకే కేపీహెచ్‌బీ కాలనీ వైపు నుంచి హైటెక్ సిటీ మీదుగా గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, కోకాపేట వరకు రానున్న 20 నుంచి 30 ఏండ్ల వరకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మెట్రో నియో ప్రాజెక్టును చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అంతేకాక ఈ ప్రాజెక్టు నిర్మాణానికి స్థల సేకరణ ఎక్కువగా అవసరం ఉండదని.. ప్రస్తుతం ఉన్న మెట్రో స్టేషన్ల తరహాలో భారీ నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. ముఖ్యంగా మెట్రో నియోలో రైలు బోగీలు కాకుండా ఎలక్ట్రికల్ బస్సులు ఉంటాయి. దీంతో ట్రాక్‌లు వేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుత ప్రజా రవాణా వ్యవస్థకు సరిగ్గా ఇలాంటి ప్రాజెక్టులే సరిపోతాయని భావించి కేపీహెచ్‌బీ నుంచి కోకాపేట వరకు 24 కిలోమీటర్ల దూరం మెట్రో నియో లాంటి ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఐటీ కారిడార్ వైపే ట్రాఫిక్ అధికం..
- గ్రేటర్లో ఉన్న ఐటీ కంపెనీల్లో 95 శాతం నగరానికి పడమర దిక్కునే ఉన్నాయి.
- దీంతో నగరం నలుమూలల నుంచి ఈ ప్రాంతానికి వచ్చిపోయే వారే అధికంగా ఉంటారు.
- ఈ నేపథ్యంలో ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాలకు నగరానికి తూర్పు వైపు మెట్రోరైలు సదుపాయం ఉండగా.. ఉత్తర దిక్కుగా ఉన్న కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్ ప్రాంతాల నుంచి రోడ్డు మార్గాలే ఉన్నాయి.
- ప్రస్తుతం ఈ ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌కు వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంది.
- ఇది భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉండటంతో కేపీహెచ్బీని కేంద్రంగా చేసుకొని ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, హైటెక్‌సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ మీదుగా కోకాపేట ఓఆర్ఆర్ వరకు మెట్రో నియో ప్రాజెక్టును చేపడితే ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు సరిపోతుందని గుర్తించారు.
- కాగా నగరానికి దక్షిణ ప్రాంతం నుంచి ఐటీ కారిడార్‌కు వచ్చేందుకు ఔటర్ రింగు రోడ్డు ఉండగా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓఆర్ఆర్ వెంట మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టాలని గతంలోనే నిర్ణయించారు.
- దీంతో నగరం నలుమూలల నుంచి ఐటీ కారిడార్‌కు వచ్చి వెళ్లేందుకు మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి రావడం ఖాయంగా మారింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Metro Neo
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురి ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

