చెన్నై: తమిళ సినిమా ఇండస్ట్రీలో అగ్రశ్రేణి నటుడిగా వెలుగొందుతున్న హీరో విజయ్‌కి మద్రాస్ హైకోర్టు చివాట్లు పెట్టింది. రీల్ హీరోలకు పన్నులు కట్టాలంటే మనసొప్పడంలేదని, వెనుకాముందు ఆడుతున్నారని కోర్టు విమర్శించింది. ఇంగ్లండ్ నుంచి తాను దిగుమతి చేసుకున్న కారుకు పన్ను మినహాయింపు కోరుతూ 2012లో హీరో విజయ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
కాగా, హీరో విజయ్ 2012లో ఇంగ్లండ్‌లో లగ్జరీ కారును (రోల్స్ రాయిస్) కొనుగోలు చేసి భారత్‌కు దిగుమతి చేసుకున్నాడు. కానీ, ఆ కారు దిగుమతికి సంబంధించి భారత ప్రభుత్వానికి పన్ను చెల్లించలేదు. పైగా తన కారుపై దిగుమతి పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కొట్టివేసింది. అంతేగాక పన్ను తప్పించుకునే ప్రయత్నం చేసినందుకు రూ.లక్ష జరిమానా కూడా విధించింది.