16న ఆరుగురు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్..!
PM Modi video conference: కరోనా పరిస్థితిపై ఇవాళ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన ప్రధాని నరేంద్రమోదీ.. ఈ నెల 16న మరో ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో

న్యూఢిల్లీ: కరోనా పరిస్థితిపై ఇవాళ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన ప్రధాని నరేంద్రమోదీ.. ఈ నెల 16న మరో ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం మీడియాకు వెల్లడించింది.
కరోనా మహమ్మారి శరవేగంగా ఉత్పరివర్తనం చెందుతున్న నేపథ్యంలో.. కరోనా ఉత్పరివర్తనాలపై కఠిన పర్యవేక్షణ ఉండాలని, అన్ని రకాల వేరియంట్లను సునిశితంగా పరిశీలించాలని ఈ సమావేశంలో ముఖ్యమంత్రులకు ప్రధాని సూచించనున్నారు. కరోనా వేరియంట్లు, వాటి ప్రభావంపై నిపుణులు అధ్యయనం చేస్తున్న విషయాన్ని వారికి వివరించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కట్టడికి నివారణ, చికిత్స కీలకమని, అందరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రధాని సూచించనున్నట్లు పీఎంవో తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

