e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News తేల్చేసిన డొమినికా: చోక్సీని భార‌త్‌కు అప్ప‌గించాల్సిందే!

తేల్చేసిన డొమినికా: చోక్సీని భార‌త్‌కు అప్ప‌గించాల్సిందే!

తేల్చేసిన డొమినికా: చోక్సీని భార‌త్‌కు అప్ప‌గించాల్సిందే!

న్యూఢిల్లీ: ప‌రారీలో ఉన్న ఆభ‌ర‌ణాల వ్యాపారి మెహుల్ చోక్సీని భార‌త్‌కు అప్ప‌గించాల్సిందేన‌ని డొమినికా ప్ర‌భుత్వం తేల్చేసింది. డొమినికా హైకోర్టులో చోక్సీ దాఖ‌లు చేసిన హైబియ‌స్ కార్ప‌స్ పిటిష‌న్ బుధ‌వారం విచార‌ణ‌కు వ‌చ్చింది. దీనిపై న్యాయ‌స్థానం ముందు డొమినికా ప‌బ్లిక్ ప్రాసిక్యూష‌న్ స‌ర్వీస్ వాదిస్తూ.. చోక్సీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌కు విచార‌ణార్హ‌త లేద‌ని, దాన్ని విచారించొద్ద‌ని కోరింది.

అంటిగ్వా-బార్బుడా నుంచి ప‌రారై డొమినికాలో పోలీసుల‌కు చిక్కిన మెహుల్ చోక్సీ త‌ర‌పున ఆయ‌న న్యాయ‌వాదులు ఈ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ప్ర‌స్తుతం ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్న చోక్సీ.. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. చోక్సీ త‌ర‌పున ఏడుగురు న్యాయ‌వాదులు హాజ‌ర‌య్యారు.

తేల్చేసిన డొమినికా: చోక్సీని భార‌త్‌కు అప్ప‌గించాల్సిందే!

భార‌త ద‌ర్యాప్తు సంస్థ‌ల టీమ్‌లు కూడా కోర్టు హాలులోనే ఉన్నాయి. ప‌రారీలో ఉన్న ఆర్థిక నేర‌గాడు మెహుల్ చోక్సీ ఏనాడూ భార‌త పౌర‌స‌త్వాన్ని వ‌దులుకోలేద‌ని వాదించాయి. ఈ మేర‌కు ఆయ‌న ఆధార్ కార్డ్‌, పాన్ కార్డు, రేష‌న్ కార్డును న్యాయ‌స్థానానికి స‌మ‌ర్పించాయి.

ఇదిలా ఉంటే చోక్సీ భార్య ప్రీతి చోక్సీ ఏఎన్ఐ వార్తా సంస్థ‌తో మాట్లాడుతూ త‌న భ‌ర్త‌కు గాయాలు కావ‌డంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఒక‌వేళ స‌జీవంగా వెనుక‌కు తీసుకురావాల‌ని భావిస్తే, త‌న భ‌ర్త‌ను భౌతికంగా, మాన‌సికంగా ఎందుకు వేధించార‌ని ప్ర‌శ్నించారు. త‌న భ‌ర్త‌కు ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని చెప్పారు.

త‌న భ‌ర్త మెహుల్ చోక్సీ ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అంటిగ్వా పౌరుడిగా ఆయ‌న‌కు అన్ని హ‌క్కులు ఉన్నాయ‌ని చెప్పారు. ఆ దేశ రాజ్యాంగం ప్ర‌కారం ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని అన్నారు.

క‌రేబియ‌న్ దేశాల్లో చ‌ట్టాల‌పై విశ్వాసం ఉంద‌ని ప్రీతి పేర్కొన్నారు. త‌న భ‌ర్త సుర‌క్షితంగా అంటిగ్వాకు తిరిగి వ‌స్తార‌ని వేచి చూస్తున్న‌ట్లు తెలిపారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

ఆటోకు కరోనా సెగ

దేశ ప్రజలందరికీ ఉచితంగానే టీకాలు ఇవ్వండి.. కోవిడ్ నుంచి కోలుకుంటూ కేంద్రానికి థరూర్ విజ్ఞప్తి

ఆన్‌లైన్ క్లాస్ వినాలంటే ఆరు కిలోమీట‌ర్లు న‌డ‌వాల్సిందే

22 కోట్ల కోవాగ్జిన్ టీకాల‌ను ఉత్ప‌త్తి చేయ‌నున్న ముంబై కంపెనీ

మరో వైరస్‌ కలకలం.. దేశంలో తొలిసారిగా స్కిన్‌ బ్లాక్‌ ఫంగస్‌ కేసు గర్తింపు

అంబులెన్సుల దందా.. 40 కి.మీట‌ర్ల‌కు రూ.17 వేలు

న్యూయార్క్‌ కన్నా ముంబైలో రెట్టింపు!

గర్భిణులకు 2-డీజీ వద్దు

రాందేవ్‌ బాబా దేశ వ్యతిరేకి : ఐఎంఏ

ఎస్పీఎస్ఎన్ లో 11 జూన్ నుంచి అతిపెద్ద అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్స్ లైవ్..

నో డౌట్‌: ఇప్ప‌ట్లో లీట‌ర్ పెట్రోల్ రూ.100 త‌గ్గ‌దు..!!

విదేశీ వ్యాక్సిన్ల‌కు ఆ ర‌క్ష‌ణ క‌ల్పించ‌డానికి సిద్ధం!

పాక్‌తో క‌లిసి వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద మిస్సైళ్ల‌ను ప‌రీక్షిస్తున్న చైనా

పాకిస్థాన్‌లో మ్యూజియాలుగా రాజ్‌క‌పూర్‌, దిలీప్‌కుమార్ ఇళ్లు

అతిపెద్ద మాంస విక్రయ సంస్థ‌పై సైబ‌ర్ దాడి..

ఆ ఒక్క క‌రోనా వేరియంటే ఆందోళ‌న క‌లిగిస్తోంది: డ‌బ్ల్యూహెచ్‌వో

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తేల్చేసిన డొమినికా: చోక్సీని భార‌త్‌కు అప్ప‌గించాల్సిందే!

ట్రెండింగ్‌

Advertisement