e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News సియాంకు కేంద్రం హెచ్చ‌రిక‌: ఏడాదిలోపు ఇథ‌నాల్ బైక్స్ కావాలి!

సియాంకు కేంద్రం హెచ్చ‌రిక‌: ఏడాదిలోపు ఇథ‌నాల్ బైక్స్ కావాలి!

సియాంకు కేంద్రం హెచ్చ‌రిక‌: ఏడాదిలోపు ఇథ‌నాల్ బైక్స్ కావాలి!

న్యూఢిల్లీ: పెట్రోల్ గానీ, డీజిల్ గానీ, ఎల‌క్ట్రిక్ బ్యాట‌రీ గానీ లేకుండానే టూ వీల‌ర్ న‌డుప‌డం సాధ్య‌మ‌ని మీరు భావిస్తున్నారా.. అవును అది నిజం కానున్న‌ది. ఆ దిశ‌గా న‌రేంద్ర‌మోదీ స‌ర్కార్ అడుగులేస్తున్న‌ది. 94 శాతం ఇథ‌నాల్ క‌లిపిన పెట్రోల్‌తో న‌డిపే ద్విచ‌క్ర వాహ‌నాల‌ను త‌యారుచేసి, విక్ర‌యించాల‌ని ఆటోమేక‌ర్ల‌ను కోరుతున్న‌ది. అదీ కూడా ఏడాది లోపు ఆ వాహ‌నాల‌ను అందుబాటులోకి తేవాల‌ని సూచించింది.

ఈ విష‌య‌మై ఆటో ఇండ‌స్ట్రీ బాడీ సియామ్ ప్ర‌తినిధులతో కేంద్ర చ‌మురు, రోడ్డు ర‌వాణా శాఖ‌ల అధికారులు, నీతి ఆయోగ్ అధికారులు ఉన్న‌త స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ100 టూ వీల‌ర్ వెహిక‌ల్స్ త‌యారీ, విక్ర‌యానికి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌పై చ‌ర్చించారు.

ఏడాదిలోపు 94 శాతం ఇథ‌నాల్‌ క‌లిపిన పెట్రోల్‌తో న‌డిపే ద్విచ‌క్ర వాహానాల‌ను విక్ర‌యించాల‌ని ఆటోమొబైల్ సంస్థ‌ల‌ను కేంద్రం కోరింది. ఇంత‌కుముందు 2023 నాటికి 20 శాతం ఇథ‌నాల్ క‌లిపిన పెట్రోల్‌తో న‌డిచే వాహ‌నాల‌ను రోడ్ల‌పైకి తేవాల‌న్న నిర్ణ‌యం అమ‌లును కేంద్రం ఏడాది ముందుకు జ‌రిపింది.

ఇంధ‌న రంగంలో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ స్వ‌యం స‌మ్రుద్ధి సాధించ‌డంలో ఇథ‌నాల్ మిశ్ర‌మంతో కూడిన పెట్రోల్ వినియోగం కీల‌కం కానున్న‌ద‌ని ఇటీవ‌ల ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌లో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.

ఇథ‌నాల్ క‌లిపిన పెట్రోల్‌తో న‌డిచే వాహ‌నాల‌ను విక్ర‌యించే ఆటో మేక‌ర్ల‌కు, కొనుగోలు చేసే వినియోగ‌దారుల‌కు ఇన్సెంటివ్‌లు ఇవ్వాల‌ని కేంద్రం భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

అయితే, సంప్ర‌దాయ వాహ‌నాల‌తో పోలిస్తే ఇథ‌నాల్ క‌లిపిన వాహ‌నాల ధ‌ర ఎక్కువ అని, ఖ‌ర్చుతో కూడుకున్న‌ న్యూ ఫ్లెక్స్ ఇంజిన్ వెహిక‌ల్స్ వైపు వినియోగ‌దారులు మ‌ళ్ల‌క‌పోవ‌చ్చున‌ని ప్ర‌భుత్వానికి సియామ్ ప్ర‌తినిధులు నివేదించారు.

అయితే, పూర్తిస్థాయిలో కంపాటిబుల్ ఫ్లెక్స్ ఇంజిన్ల దిశ‌గా మ‌ళ్లేందుకు ఈ100 సంబంధ వ‌నరుల‌ను పెంపొందించ‌డంతోపాటు స‌ప్ల‌యి పెంచాల‌ని కేంద్రాన్ని సియాం కోరింది.

ఇందులో భాగంగా అద‌న‌పు ఇథ‌నాల్ పంపు నూజుల్స్‌తోపాటు అద‌న‌పు అండ‌ర్ గ్రౌండ్ ట్యాంక్‌, పైపులు, ఇథ‌నాల్ క‌లిపిన పెట్రోల్ స‌ప్ల‌యి డిస్పెన్సింగ్ యూనిట్ల‌ను ఆవిష్క‌రించేందుకు కేంద్రం క‌స‌ర‌త్తు చేస్తున్న‌ది.

2020-21లో ఇథ‌నాల్ స‌ర‌ఫ‌రా చేసిన తొలి నాలుగు నెల‌ల్లోనే భార‌త్‌లో ఇథ‌నాల్ క‌లిపిన పెట్రోల్ వినియోగం 7.2 శాతాన్ని దాటింది. ఈ మార్క్‌ను దాట‌టం ఇదే తొలిసారి. ఈ నేప‌థ్యంలో 2022 నాటికి ఇథ‌నాల్ క‌లిపిన ఇంధ‌నం వినియోగం 10 శాతానికి పెంచాల‌ని కేంద్రం ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.

గోవా, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, హ‌ర్యానా, పంజాబ్‌, ఢిల్లీ, ఉత్త‌రాఖండ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల‌తోపాటు డామ‌న్ అండ్ డ‌యూ కేంద్ర పాలిత ప్రాంతంలో 9.5-10 శాతం ఇథ‌నాల్ క‌లిపిన పెట్రోల్ వినియోగిస్తున్నారు. 2022 ల‌క్ష్యానికి ఈ రాష్ట్రాలు చేరువ‌లో ఉన్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి:

ఉద్యోగులకు ఆకర్షణీయ వీఆర్‌ఎస్‌?

కొత్త ఐటీ పోర్టల్‌లో సమస్యలు

3.5 సెకండ్లలో 100 కి.మీ వేగం

బెంజ్‌ అల్ట్రా-లగ్జరీ కారు

వృద్ధిరేటు 8.3%కు కుదించిన‌ ప్ర‌పంచ‌బ్యాంకు.. ఎందుకంటే?!

పియాజియో వ‌న్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ రేంజ్‌, వేరియంట్లు ఇలా..

ఫ్రాంక్లిన్‌పై సెబీ రూ.5 కోట్ల ఫైన్‌

వృద్ధిరేటు 8.3%కు కుదించిన‌ ప్ర‌పంచ‌బ్యాంకు.. ఎందుకంటే?!

ఆ రెండు బ్యాంకులపై ఆర్బీఐ ఫైన్‌.. ఎందుకంటే?!

ఇరాన్‌పై ఆంక్ష‌లు ఎత్తేయ‌కుంటే పెట్రోల్ పైపైకే!

కోవిడ్ ఔష‌ధాల‌పై 5 శాతానికి జీఎస్టీ మిన‌హాయింపు? ఇంకా..!!

బిట్ కాయిన్ ఒక స్కాం.. డాల‌ర్‌కు వ్య‌తిరేకం

రేపు ఆకాశంలో ఆవిష్కృతమవనున్న అద్భుతం

జాతి వివ‌క్ష ట్వీట్లు.. చిక్కుల్లో మ‌రో ఇద్ద‌రు స్టార్ ఇంగ్లండ్ క్రికెట‌ర్లు

పీహెచ్‌సీలో ఆగిన రిఫ్రిజిరేట‌ర్‌.. గ‌డ్డ‌క‌ట్టిన 480 టీకా డోసులు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సియాంకు కేంద్రం హెచ్చ‌రిక‌: ఏడాదిలోపు ఇథ‌నాల్ బైక్స్ కావాలి!

ట్రెండింగ్‌

Advertisement