CM Shivakumar | కర్ణాటకలో విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం.. తొలి క్యాబినెట్ భేటీలో సీఎం నిర్ణయం
CM Shivakumar : కర్ణాటకలో నూతన సీఎంగా డీకే శివకుమార్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు అందించాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. అంతేకాదు.. రైతులు వలస పోకుండా నివారణ చర్యలు తీసుకుంటామన్నారు.
CM Shivakumar : కర్ణాటకలో నూతన సీఎంగా డీకే శివకుమార్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. పదవీ ప్రమాణం అనంతరం ఆయన తన మంత్రివర్గంతో తొలిసారి సీఎం హోదాలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కర్ణాటకలో విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు అందించాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు.
అంతేకాదు.. రైతులు వలస పోకుండా నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రివర్గ భేటీ అనంతరం నిర్ణయాల్ని సీఎం శివకుమార్ మీడియాకు వివరించారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి త్వరలోనే క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. ఇదే సమయంలో ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి ప్రైవేట్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ నిర్వహిస్తామన్నారు. అనధికారిక, అక్రమ కట్టడాలకు ఏ–ఖాటా డాక్యుమెంట్ జారీ చేస్తామని వివరించారు. ప్రజలు, యువత కర్ణాటక అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఏ ఒక్క నాయకుడు ఒంటరిగా మార్పును తీసుకురాలేమన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రతి రైతు, కార్మికుడు, మహిళ, విద్యార్థి, యువత అందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రజలంతా ఒక లక్ష్యంతో పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అందరూ కలిసి పనిచేస్తే అధిగమించలేని సమస్య లేదన్నారు. బుధవారం సీఎంగా శివకుమార్తోపాటు 13 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

