బాహుబలిగా వ్యవహరించొద్దు
’న్యాయాధికారాలను వినియోగించుకునేటప్పుడు బాహుబలిలా వ్యవహరించొద్దు‘ అంటూ బీహార్ న్యాయమూర్తి అనిల్ కుమార్ను సుప్రీంకోర్టు ఘాటుగా మందలించింది.
- బీహార్ న్యాయాధికారిపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ, నవంబర్ 23: ’న్యాయాధికారాలను వినియోగించుకునేటప్పుడు బాహుబలిలా వ్యవహరించొద్దు‘ అంటూ బీహార్ న్యాయమూర్తి అనిల్ కుమార్ను సుప్రీంకోర్టు ఘాటుగా మందలించింది. ఎస్పీ తన ఆదేశాలను పాటించలేదని అదే రోజు ఆయనను దోషిగా ప్రకటించి, జరిమానా విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. రోహ్తాస్ జిల్లా అదనపు సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్న అనిల్ కుమార్.. అప్పటి ఎస్పీ రౌషన్ కుమార్కు సెప్టెంబరు 29న నామమాత్రంగా రూ.1 జరిమానా విధించారు.
2023లో ముగిసిన ఓ క్రిమినల్ కేసులో తప్పుడు సాక్ష్యం ఇచ్చిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. అయితే ఆ ఆదేశాలను ఎస్పీ అమలు చేయలేదని భావించిన జడ్జి ఆయనను కోర్టుకు పిలిపించి, ఉద్దేశపూర్వకంగా ధిక్కరించినట్లు పేర్కొంటూ, అదే రోజు దోషిగా నిర్ధారించారు. జరిమానా వివరాలను ఎస్పీ సర్వీస్ రికార్డుల్లో నమోదు చేయాలని డీజీపీని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను పాట్నా హైకోర్టు నిలిపివేసింది. దీనిని సవాలు చేస్తూ జడ్జి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆయన తీరును తప్పుబట్టింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

