Coffee | రోజూ కాఫీ తాగేవారు వీటిని కలిపితే.. ఎన్నో పోషకాలను పొందవచ్చు..
ఉదయం నిద్రలేచిన వెంటనే చాలామందికి గుర్తొచ్చేది ఒక వేడి కప్పు కాఫీ. కొందరికి అది రోజును ఉత్సాహంగా ప్రారంభించే అలవాటు అయితే, మరికొందరికి పనిబారిన మధ్యలో కాసేపు రిలాక్స్ అయ్యే మార్గం అని చెప్పవచ్చు. రుచి, సువాసనతోపాటు కాఫీలో సహజంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలను అందిస్తాయని ఇప్పటికే అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.
Coffee | ఉదయం నిద్రలేచిన వెంటనే చాలామందికి గుర్తొచ్చేది ఒక వేడి కప్పు కాఫీ. కొందరికి అది రోజును ఉత్సాహంగా ప్రారంభించే అలవాటు అయితే, మరికొందరికి పనిబారిన మధ్యలో కాసేపు రిలాక్స్ అయ్యే మార్గం అని చెప్పవచ్చు. రుచి, సువాసనతోపాటు కాఫీలో సహజంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలను అందిస్తాయని ఇప్పటికే అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే కొన్ని పోషక విలువలు కలిగిన పదార్థాలను కాఫీలో కలపడం ద్వారా దాని ఆరోగ్య ప్రయోజనాలను మరింత పెంచుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
కోకో పౌడర్, నెయ్యి..
కాఫీలో కొద్దిపాటి కోకో పౌడర్ లేదా ముడి కొకొవా కలపడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కోకోలో సమృద్ధిగా ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఇందులోని పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్లు గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంతోపాటు మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో కాఫీ రుచికి కొత్తదనం రావడమే కాకుండా అదనపు పోషకాలు కూడా అందుతాయి. ఇటీవలి కాలంలో కాఫీలో ఏ2 నెయ్యి కలిపి తాగడం కూడా ప్రాచుర్యం పొందుతోంది. ఒక టీస్పూన్ ఏ2 నెయ్యిని కాఫీలో కలపడం ద్వారా జీర్ణవ్యవస్థకు మేలు జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇందులో ఉండే బ్యూటిరిక్ యాసిడ్ పేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది జీర్ణనాళంలో వాపులను తగ్గించడంలో, పేగుల అంతర్గత పొరను ఆరోగ్యంగా ఉంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
దాల్చిన చెక్క..
దాల్చిన చెక్క కూడా కాఫీకి రుచి, సువాసనను జోడించడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను అందించే పదార్థంగా గుర్తింపు పొందింది. కాఫీలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలపడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్పందన మెరుగుపడే అవకాశం ఉంటుంది. దీంతో గ్లూకోజ్‌ను శరీరం మరింత సమర్థంగా వినియోగించుకోగలుగుతుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉన్నవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ పదార్థాలను కాఫీలో చేర్చడం వల్ల కొన్ని ప్రయోజనాలు లభించే అవకాశం ఉన్నప్పటికీ, అవి ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి. సమతుల ఆహారం, క్రమమైన వ్యాయామం, తగిన నిద్రతోపాటు కాఫీని పరిమిత మోతాదులో తీసుకోవడం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చిన్న మార్పులతోనే ప్రతిరోజూ తాగే కాఫీని మరింత పోషకవంతంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Coffee
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

