రేపు ఆకాశంలో ఆవిష్కృతమవనున్న అద్భుతం
రేపు ఆకాశంలో ఆవిష్కృతమవనున్న అద్భుతం | ఈ నెల 10న ఆకాశంలో ఖగోళ అద్భుతం చోటు చేసుకోనున్నది. ఈ ఏడాది తొలి సంపూర్ణ సూర్యగ్రహణం గురువారం ఏర్పడనున్నది.

న్యూఢిల్లీ : ఈ నెల 10న ఆకాశంలో ఖగోళ అద్భుతం చోటు చేసుకోనున్నది. ఈ ఏడాది తొలి సంపూర్ణ సూర్యగ్రహణం గురువారం ఏర్పడనున్నది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై ఉన్న సమయంలో సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వస్తాడు. అప్పుడు సూర్యుడి నీడ భూమిపై పడుతుంది. దీన్నే సూర్యగ్రహణంగా పిలుస్తారు. ఈ అద్భుతం దృశ్యం పలు దేశాల్లో కనిపించనుండగా.. కొన్ని దేశాల్లో మాత్రమే రింగ్ ఆఫ్ ఫైర్ దర్శనమివ్వనుంది. సూర్యగ్రహణం భారత్‌లో మాత్రమే పాక్షికంగా కనిపించనుంది. కేవలం అరుణాచల్ ప్రదేశ్‌లో సూర్యాస్తమయం సమయంలో కనిపిస్తుందని మధ్యప్రదేశ్‌లోని బిర్లా ప్లానిటోరియం శాస్త్రవేత్తలు తెలిపారు.
భారత్‌లో సూర్యగ్రహణం మధ్యాహ్నం 1.42 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 6.41 గంటలకు ముగియనుంది. గ్రహణాన్ని ఉత్తర అమెరికా ప్రజలు, యూరప్, ఆసియా, ఉత్తర కెనడా, రష్యా, గ్రీన్లాండ్లో కనిపించనుంది. సూర్యగ్రహణం ఉచ్ఛస్థితికి చేరినప్పుడు ఏర్పడే రింగ్ ఆఫ్ ఫైర్ గ్రీన్లాండ్, సెర్బియాతో పాటు ఉత్తర ధృవానికి చివరన ప్రాంతాల్లో కనిపిస్తుందని టైమ్ అండ్ డేట్ వెబ్సైట్ పేర్కొంది. ఈస్ట్‌కోస్ట్, అప్పర్ మిడ్వెస్ట్ దేశాల ప్రజలు పాక్షికంగా ఈ అద్భుతం కనిపిస్తుందని చెప్పింది. గ్రహణం ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రత్యక్ష్య ప్రసారం చేస్తామని తెలిపింది. ఇదిలా ఉండగా.. డిసెంబర్ 4న మరో సూర్యగ్రహణం ఏర్పడనుంది.
ఇవి కూడా చదవండి..
ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 17 మంది దుర్మరణం
ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ టీకాల ధరలను నిర్ణయించిన కేంద్రం
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో కొత్తగా 92,596 కరోనా కేసులు
రైతులతో చర్చలకు కేంద్రం సిద్ధమే.. : కేంద్రమంత్రి
దేశంలో 23.88 కోట్ల కొవిడ్ టీకాల పంపిణీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

