వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | దేశంలో ఇంధన ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. జూన్‌లో మంగళవారం ఐదోసారి చమురు కంపెనీలు ధరలను పెంచాయి.

న్యూఢిల్లీ : దేశంలో ఇంధన ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు జూన్‌లో ఐదోసారి చమురు కంపెనీలు ధరలను పెంచాయి. ఇప్పటికే రేట్లు ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరుకోగా.. బుధవారం లీటర్ పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెరిగింది. పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.56కి చేరగా.. డీజిల్ ధర రూ.86.47కి చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో పెట్రోల్ ధర రూ.102 వైపు పరుగులు పెడుతుండగా.. ప్రస్తుతం రూ.101.76, డీజిల్ రూ.93.85 పలుకుతోంది.
కోల్‌కతాలో పెట్రోల్ రూ.95.52, డీజిల్ రూ.89.32, చెన్నైలో పెట్రోల్ రూ.96.94, డీజిల్, రూ.96.94కు చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.99.32, డీజిల్ రూ.94.26.. విజయవాడలో పెట్రోల్ రూ.101.55, డీజిల్ రూ.95.90కి చేరింది. మే 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఇంధన ధరలు 22వ సార్లు పెరిగాయి. వరుసగా పెరుగుతూ వస్తున్న ధరలతో సామాన్యులు పెట్రోల్ బంకుకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా మహమ్మారి సమయంలో రోజురోజుకు పైపైకి వెళ్తున్న ధరలతో జనం బెంబేలెత్తుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 17 మంది దుర్మరణం
ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ టీకాల ధరలను నిర్ణయించిన కేంద్రం
09-06-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
వ్యాక్సినేషన్‌కు వెళ్లే ముందు..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

