Tej Pratap | ‘రబ్రీ దేవి పాదాలకు నమస్కరించిన సామ్రాట్ చౌదరి’.. ఏఐ ఫొటో షేర్ చేసిన తేజ్ ప్రతాప్
Tej Pratap | బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ సోషల్ మీడియాలో ఒక ఫొటో షేర్ చేశారు. తన తల్లి రబ్రీ దేవి పాదాలకు సీఎం సామ్రాట్ చౌదరి నమస్కరిస్తున్న ఏఐ చిత్రాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బహిరంగ సమావేశాల్లో సంయమనం పాటించాలని, గౌరవపూర్వకమైన భాషను ఉపయోగించాలని సూచించారు.
పాట్నా: బీహార్ మాజీ మంత్రి, జనశక్తి జనతా దళ్ నాయకుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap) సోషల్ మీడియాలో ఒక ఫొటో షేర్ చేశారు. తన తల్లి రబ్రీ దేవి పాదాలకు సీఎం సామ్రాట్ చౌదరి నమస్కరిస్తున్న ఏఐ చిత్రాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బహిరంగ సమావేశాల్లో సంయమనం పాటించాలని, గౌరవపూర్వకమైన భాషను ఉపయోగించాలని సూచించారు. మాజీ సీఎం రబ్రీ దేవి తన అధికార నివాసాన్ని ఖాళీ చేయకపోవడాన్ని సీఎం సామ్రాట్ చౌదరి ఇటీవల బహిరంగంగా విమర్శించారు. ‘నివాసాన్ని ఖాళీ చేయకుండా ఆపే అధికారం ఎవరికీ లేదు. ప్రభుత్వ ఆస్తి తమదే అన్నట్లుగా కొందరు ప్రవర్తిస్తున్నారు’ అని ముజఫర్‌పూర్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన అన్నారు.
కాగా, రబ్రీ దేవి పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ దీనిపై స్పందించారు. రబ్రీ దేవి పాదాలకు సీఎం సామ్రాట్ చౌదరి నమస్కరిస్తున్న ఏఐ చిత్రాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రికి దీనిని ట్యాగ్ చేశారు. రాజకీయ నాయకులు, ముఖ్యంగా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, బహిరంగ ప్రకటనలు చేసేటప్పుడు హుందాగా, మర్యాదగా ప్రవర్తించాలని ఆయన సూచించారు.
‘మా అమ్మ మా గౌరవానికి చిహ్నం. అందువల్ల ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్య అయినా సరైనదిగా భావించలేం. ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు సహజమే. అయినప్పటికీ, సంభాషణ ఎల్లప్పుడూ మర్యాదపూర్వకంగా, గౌరవప్రదంగా ఉండాలి. పరస్పర గౌరవం, హుందాగా మాట్లాడే విధానమే రాజకీయాలకు నిజమైన గుర్తులు’ అని తేజ్ ప్రతాప్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
मैं यही कहना चाहता हूँ कि राज्य के नेताओं को, विशेषकर मुख्यमंत्री और वरिष्ठ पदों पर बैठे लोगों को, हमेशा संयमित और मर्यादित भाषा का प्रयोग करना चाहिए। किसी भी व्यक्ति पर टिप्पणी करते समय उसकी उम्र, सम्मान और सामाजिक गरिमा का ध्यान रखना आवश्यक है।
हमारी माता श्री हमारे लिए सम्मान… pic.twitter.com/7Ao6Y5shJo
— Tej Pratap Yadav (@TejYadav14) June 2, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

