smartphones | రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా.. కొన్ని బెస్ట్ మొబైల్స్ ఇవే
smartphones : బేసిక్ ఫీచర్స్ ఉండే మొబైల్స్ వాడుతూ స్మార్ట్ఫోన్లు కొనాలనుకునేవారికి, లేదా రూ.10,000 లోపు స్మార్ట్ఫోన్లు కావాలని కోరుకునేవారికి కూడా కొన్ని మంచి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
smartphones : బేసిక్ ఫీచర్స్ ఉండే మొబైల్స్ వాడుతూ స్మార్ట్ఫోన్లు కొనాలనుకునేవారికి, లేదా రూ.10,000 లోపు స్మార్ట్ఫోన్లు కావాలని కోరుకునేవారికి కూడా కొన్ని మంచి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ధరలోనే డీసెంట్ కెమెరా, 90 హెర్జ్ డిస్ప్లే, బ్యాటరీతో కూడా కొన్ని ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల స్మార్ట్ఫోన్ల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వీటి ధరలు కూడా కాస్త పెరిగాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్లో అందుబాటులో ఉన్న 5 బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవి.
మోటో జీ05
ఇది బడ్జెట్ ఫోన్. 6.67 అంగుళాల ఐపీఎస్ డిస్ప్లే, 90 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, 50 ఎంపీ బ్యాక్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, మీడియాటెక్ హీలియో జీ81 అల్ట్రా ప్రాసెసర్, 4జీబీ+64జీబీ, 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15 ఓఎస్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 4జీ, డాల్బీ అట్మాస్ స్పీకర్స్ వంటి ఫీచర్లున్నాయి. ధర రూ.7,299.
గెలాక్సీ ఎఫ్05
సామ్సంగ్ సంస్థ నుంచి వచ్చిన మరో బేసిక్ స్మార్ట్‌ఫోన్ ఇది. 6.74 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, మీడియా టెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 50ఎంపీ+2ఎంపీ డ్యుయల్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, 3.5 ఎంఎం ఆడియో జాక్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 4జీబీ+64జీబీ వంటి ఫీచర్లున్నాయి. ధర రూ.6,499.
రెడ్మి ఏ5 4జీ
చైనాకు చెందిన రెడ్మి సంస్థ నుంచి వచ్చిన మరో బేసిక్ మోడల్ స్మార్ట్‌ఫోన్ ఇది. 6.88 అంగుళాల హెచ్డీ+ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, యునిసాక్ టీ7250 ప్రాసెసర్, 3జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ, మైక్రో ఎస్డీ సపోర్ట్, 32 ఎంపీ ఏఐ డ్యుయల్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 15 ఓఎస్ వంటి ఫీచర్లున్నాయి. ధర రూ.6,499/రూ.7,499/రూ.9,999.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్డి
ఇన్ఫినిక్స్ సంస్థ నుంచి వచ్చిన బడ్జెట్ ఫ్రెండ్లీ, బేసిక్ స్మార్ట్‌ఫోన్ ఇది. 6.6 అంగుళాల హెచ్డి+ డిస్ప్లే, 90 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, యునిసాక్ టీ606 ప్రాసెసర్, 3జీబీ+64జీబీ, 4జీబీ+64జీబీ, ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13ఎంపీ ఏఐ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, సైడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లున్నాయి. ధర రూ.6,699/రూ.6,999.
ఐటెల్ జెనో 20 మ్యాక్స్
రూ.10,000 లోపు ధర ఉన్న వాల్యూబుల్ ఫోన్లలో ఇదీ ఒకటి. 6.6 అంగుళాల హెచ్డీ+ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఆక్టాకోర్ యునిసాక్ ఈ7100 ప్రాసెసర్, 3జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ, 13 ఎంపీ ఏఐ కెమెరా, 5ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వంటి ఫీచర్లున్నాయి. ధర రూ.6,999
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

