ఆదివారం 07 జూన్ 2020
Business - Apr 03, 2020 , 16:26:01

క‌రోనా ఎఫెక్ట్: ప్ర‌పంచ వ్యాప్తంగా పడిపోయిన స్మార్ట్‌ఫోన్ల సేల్స్‌

క‌రోనా ఎఫెక్ట్: ప్ర‌పంచ వ్యాప్తంగా  పడిపోయిన స్మార్ట్‌ఫోన్ల సేల్స్‌

 క‌రోనా మ‌హ‌మ్మారి ఎఫెక్ట్‌ ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని రంగాల‌పై ప్ర‌భావం ప‌డింది. ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌కు విస్త‌రించిన ఈ వైర‌స్ నియంత్ర‌ణ‌కు చాలా దేశాలు లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. క‌రోనా, లాక్‌డౌన్ ప్ర‌భావం స్మార్ట్‌ఫోన్ల అమ్మ‌కాల‌పై ప‌డింది. గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో వీటి అమ్మ‌కాలు 14 శాతం పడిపోయాయి. హాంకాంగ్‌ ప్రధాన కేంద్రంగా పనిచేసే గ్లోబల్‌ ఇండస్ట్రీ అనాలిసిస్‌ సంస్థ నివేదికను విడుదలచేసింది. దీనిప్రకారం ఆపిల్‌ ఫోన్లతోపాటు, ఇతర స్మార్ట్‌ ఫోన్ల అమ్మకాలు 14 శాతం తగ్గిపోయాయని వెల్ల‌డించింది. ఇది గతేడాదితోపోల్చితే 38 శాతం తక్కువని ప్ర‌క‌టించింది.. దీనికితోడు ప్రస్తుతం చైనా, దక్షిణ కొరియా మినహా ప్రపంచ దేశాలపై కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రభావం చూపుతుండటంతో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు మరింత క్షీణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

<p>ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి<font color="#ff0000"> ..<b> <a href="https://t.me/NamastheTelangana" target="_blank">టెలిగ్రామ్</a></b></font><b> </b>యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..<br></p>


logo