Prasanna Vadanam | టాలీవుడ్ యువ హీరో సుహాస్ (Suhas) చివరగా శ్రీరంగనీతులు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. ఈ మూవీ ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేయడంలో విఫలమయ్యింది. కాగా ఈ క్రేజీ యాక్టర్ నటిస్తోన్న తాజా చిత్రం ప్రసన్నవదనం (Prasanna Vadanam). మే 3న విడుదల కానుంది. అర్జున్ వైకే డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి తెరపైకి వచ్చింది.
సలార్ ప్రాంఛైజీని తెరకెక్కిస్తున్న హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ సుహాస్ సినిమా పంపిణీ హక్కులు కొనుగోలు చేసిందన్న న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది. కర్ణాటక ప్రాంత పంపిణీ హక్కులను హోంబలే ఫిలిమ్స్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని Mythri Movie Distributors LLP పంపిణీ చేస్తోంది. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి లీడ్ హీరోగా కలర్‌ఫొటో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు.
లీడింగ్ బ్యానర్లు పంపిణీ హక్కులను ప్రసన్నవదనం సొంతం చేసుకోవడంతో ఇప్పుడు సుహాస్ సినిమాకు ఏ స్థాయిలో క్రేజ్ పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్, నందు, వివా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మణికంఠ, ప్రసాద్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. విజయ్ బల్గానిన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
సుహాస్ మరోవైపు రామ్ పసుపులేటి దర్శకత్వంలో నటిస్తున్న ఆనందరావ్ అడ్వంచర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ అప్డేట్ రావాల్సి ఉంది.
The faces conceal and the thrills unfold!
Bringing a thrilling film to the Kannada audience – #PrasannaVadanam in cinemas on May 3rd, 2024! 🔥
A @hombalefilms Release. @ActorSuhas @ManikantaJS @LTHcinemas @adityamusic pic.twitter.com/0fDQT8oDzT
— Hombale Films (@hombalefilms) April 24, 2024