Donald Trump | చాలా కోపంగా ఉన్నా.. పుతిన్ నివాసం లక్ష్యంగా ఉక్రెయిన్ దాడిపై ట్రంప్ ఆగ్రహం
Donald Trump | రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై జరిగిన డ్రోన్ల దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధ పరిస్థితుల్లో దాడులు చేయడం సహజమే కానీ.. నేరుగా అధ్యక్షుడి నివాసాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని అన్నారు. ఇలాంటి చర్యలకు ఇది సరైన సమయం కాదని వ్యాఖ్యానించారు.
Donald Trump | రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై జరిగిన డ్రోన్ల దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధ పరిస్థితుల్లో దాడులు చేయడం సహజమే కానీ.. నేరుగా అధ్యక్షుడి నివాసాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని అన్నారు. ఇలాంటి చర్యలకు ఇది సరైన సమయం కాదని వ్యాఖ్యానించారు.
అమెరికా ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో రిసార్ట్‌లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ భేటీ అయ్యారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడి చేసిందనే ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. తన నివాసంపై దాడి జరిగిందని స్వయంగా పుతిన్ ఫోన్ చేసి తనకు చెప్పాడని వెల్లడించారు. ఇది చాలా చెడ్డ విషయమని, ఈ విషయంలో చాలా కోపంగా ఉన్నానని తెలిపారు. అదే సమయంలో దాడిపై అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. అసలు అటువంటి దాడే జరగకపోయే అవకాశం కూడా ఉందని.. దీనిపై పూర్తిగా నమ్మకం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
రష్యా ఆరోపణలను ఖండించిన ఉక్రెయిన్
పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడికి తెగబడిందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోస్ ఆరోపించారు. మాస్కో సమీపంలోని నోవ్గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ నెల 28, 29వ తేదీల్లో ఉక్రెయిన్ 91 దీర్ఘశ్రేణి డ్రోన్లను ప్రయోగించిందని తెలిపారు. అయితే వాటన్నింటినీ రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని పేర్కొన్నారు. ఈ ఘటనను దేశ ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఇలాంటి చర్యలకు ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. ప్రతీకార దాడుల కోసం ఇప్పటికే రష్యా సైన్యం టార్గెట్‌ను ఎంచుకున్నదని తెలిపారు. కాగా, రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ ఖండించింది. పుతిన్ నివాసంపై దాడి చేశామన్న రష్యా వాదనలో నిజం లేదని స్పష్టం చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Donald Trump
- Putin
- Russia
- trump
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

