రవితేజ: ముగ్గురు కుర్ర హీరోయిన్లతో రొమాన్స్
రవితేజ | 50 దాటిన రవితేజ 20 ల్లో ఉన్న ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తున్నాడు. ఒక్కో సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో రొమాంటిక్ ట్రాక్ నడుపుతున్నాడు.

రవితేజ ఒకే ఒక్క విజయంతో మళ్లీ సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు. వరుస సినిమాలతో రచ్చ చేస్తున్నాడు మాస్ రాజా. దానికి తోడు ఆయన సినిమాలో హీరోయిన్లు కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. 50 దాటిన రవితేజ 20 ల్లో ఉన్న ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తున్నాడు. అందులోనూ ఒక్కో సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో రొమాంటిక్ ట్రాక్ నడుపుతున్నాడు రవితేజ. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఖిలాడి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. మీనాక్షి చౌదరితో పాటు గద్దలకొండ గణేష్‌లో ఐటం సాంగ్ చేసిన డింపుల్ హయతీ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మరోవైపు త్రినాథరావు నక్కిన సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు. ఈ సారి కూడా పూర్తిగా కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు రవితేజ. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని తెలుస్తుంది. త్రినాథరావు సినిమాలో లాయర్‌గా కనిపించబోతున్నాడు ఈయన.
నిజానికి మారుతి చెప్పిన సినిమాలో కూడా హీరో లాయర్ కావడంతో ఈ కథను కాదని.. త్రినాథరావుకు ఓకే చెప్పాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలతో నటించబోతున్నాడు మాస్ రాజా. 20ల్లో ఉన్న కుర్ర హీరోయిన్లతోనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.
కొత్త హీరోయిన్ శ్రీ లీలతో పాటు మొన్న అనిల్ రావిపూడి గాలి సంపత్ సినిమాలో నటించిన లవ్లీ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించబోతున్నారు. మరోవైపు జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కూడా ఈ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతుంది.
50 ఏళ్లు దాటిన తర్వాత రవితేజ ఇలా ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతుండటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఏప్రిల్ 13న ఈ సినిమా ప్రారంభించి.. మే రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళనున్నారు. రవితేజ ప్రస్తుతం నటిస్తున్న ఖిలాడీ మే 28న విడుదల కానుంది. ఈ సినిమాతో పాటే మరో రెండు సినిమాలను లైన్లో పెడుతున్నాడు రవితేజ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పవన్ సినిమాతో మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి విజయదేవరకొండ
కన్నడ హీరో చిరంజీవి సర్జా భార్య ఏం చేస్తుంది?
ఐశ్వర్యరాజేశ్ ఫైనల్..మరో హీరోయిన్ కోసం వేట..!
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై క్లారిటీ..!
జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?
ముద్దు వీడియో షేర్ చేసిన జెనీలియా.. స్పందించిన ప్రీతి
ఈ ఇద్దరు కొత్త హీరోయిన్ల సుడి పీక్స్.. స్టార్ హీరోలతో ఆఫర్స్
తరుణ్ రీఎంట్రీ.. లవ్ స్టోరీతో వస్తున్నాడంట
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే
కంగనా రనౌత్ @ నేషనల్ అవార్డ్ నెం 4.. ఈ తరం మహానటి…
‘మహర్షి’ సినిమాకి 3 జాతీయ అవార్డులు.. కాలర్ ఎగరేస్తున్న మహేష్ ఫ్యాన్స్
జాతీయ అవార్డులు గెలుచుకుంది వీళ్లే
ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో మిస్తీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

