కంగనా రనౌత్ @ నేషనల్ అవార్డ్ నెం 4.. ఈ తరం మహానటి..
National Film Awards| 2019 సంవత్సరానికి గాను మణికర్ణికలో అత్యుత్తమ ప్రదర్శన కంగనాను జాతీయ అవార్డు వరించింది. దానికి ముందు 3 సార్లు అవార్డు సొంతం చేసుకుంది.

ఈ రోజుల్లో ఒక్క నేషనల్ అవార్డు వస్తేనే కెరీర్ అంతా చెప్పుకుని తిరుగుతారు. నాకు జాతీయ అవార్డు వచ్చింది చూడండి అంటూ ప్రమోషన్ చేసుకుంటారు. అందులో తప్పేం లేదు.. ఎందుకంటే ఎంతో కష్టపడితే గానీ జాతీయస్థాయిలో గుర్తింపు రాదు. ఒక్కసారైనా నేషనల్ అవార్డు గెలుచుకోవాలని ప్రతి యాక్టర్ కలలు కంటాడు. అలాంటిది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మాత్రం మంచినీళ్లు తాగినంత ఈజీగా జాతీయ అవార్డులు సొంతం చేసుకుంటుంది. కెరీర్ కొత్తలో కేవలం అందాల ప్రదర్శనకు తప్ప నటనకు స్కోప్ లేని పాత్రలు చేసింది ఈమె. కానీ కొన్ని సంవత్సరాలుగా కంగన ఎంచుకుంటున్న కథలు, ఈమె చేస్తున్న సినిమాలు చూస్తుంటే ఎంత మార్పు వచ్చిందో స్పష్టంగా అర్థమవుతుంది.
తాజాగా జాతీయ ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకుంది. మొత్తంగా నాలుగోసారి నేషనల్ అవార్డు గెలుచుకుంది కంగనా రనౌత్. దాంతో ఈమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

తొలిసారి మధుర్ బండార్కర్ తెరకెక్కించిన ఫ్యాషన్ సినిమాకు గాను ఉత్తమ సహాయనటి కేటగిరీలో తొలిసారి నేషనల్ అవార్డు సొంతం చేసుకుంది.
ఆ తర్వాత క్వీన్ సినిమాకు తొలిసారి జాతీయ ఉత్తమ నటి అనిపించుకుంది కంగనా రనౌత్. ఆ మరుసటి ఏడాది తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమాకు మరోసారి జాతీయ అవార్డు సొంతం చేసుకుంది.
ఇక ఇప్పుడు క్రిష్ తెరకెక్కించిన మణికర్ణిక సినిమాకు జాతీయ అవార్డు గెలుచుకుంది. ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అలాగే ఆ సినిమా సమయంలో వివాదాలు కూడా చెలరేగాయి. తన క్రెడిట్ అన్యాయంగా కంగన తీసుకుంటుంది అంటూ క్రిష్ మీడియా ముందుకు వచ్చాడు.
ఏదేమైనా కంగనా రనౌత్ నాలుగోసారి జాతీయ అవార్డు గెలుచుకోవడంపై సోషల్ మీడియాలో చర్చ జోరుగా జరుగుతోంది. బయట ఎంత ఫైర్ బ్రాండ్‌గా ఉంటుందో సినిమాల్లో అంతే అద్భుతంగా నటిస్తుంది. అందుకే ఈ భామకు వరుసగా జాతీయ అవార్డులు క్యూ కడుతున్నాయి.
కంగన జోరు చూస్తుంటే ఇది ఆరంభం మాత్రమే అనిపిస్తుంది ఇలాంటి అవార్డులు ఇంకా ఎన్నో గెలుచుకునేలా కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఇవి కూడా చదవండి..
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే
‘మహర్షి’ సినిమాకి 3 జాతీయ అవార్డులు.. కాలర్ ఎగరేస్తున్న మహేష్ ఫ్యాన్స్
జాతీయ అవార్డులు గెలుచుకుంది వీళ్లే
ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో మిస్తీ
మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత
పవన్ సినిమా హిట్ అయితేనే బన్నీ అతడికి ఛాన్స్ ఇస్తాడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

